Test centers outside the OU for the
first time - PG exams starts tomorrow
ఓయూ పరిధి దాటి పరీక్ష కేంద్రాలు - వందేళ్ల చరిత్రలో మొదటిసారి పీజీ పరీక్షలకు ఏర్పాటు
ఓయూ 102 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా విశ్వవిద్యాలయం పరిధి దాటి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పీజీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా దృష్ట్యా విద్యార్థులు రవాణా, వసతిపరమైన ఇబ్బందులు ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతో వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరు 27 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహిస్తున్న పీజీ పరీక్షలకు 9,349 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
ఇప్పటివరకూ ఓయూ పరిధిలోని హైదరాబాద్,
ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనే
పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణలోని ఇతర వర్సిటీలతో
సమన్వయంతో ఓయూ పరిధిలోని జిల్లాల్లోనే కాకుండా దాని పరిధిలో లేని వరంగల్, సూర్యాపేట, నిజామాబాద్, నల్గొండ,
కోదాడ, మహబూబ్‌నగర్, మంచిర్యాల,
కరీంనగర్ తదితర జిల్లాల్లోనూ మరో 13
కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు.
0 Komentar