Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Amazing Health Benefits of Kantola (Teasle Gourd)

 

The Amazing Health Benefits of Kantola (Teasle Gourd)

ఆకాకరతో ఆరోగ్యం మస్త్! ప్రయోజనాలివే..

మార్కెట్లో బుల్లి బుల్లిగా.. కనిపించే ఆకాకర కాయలు రుచి మాత్రమే కాదండోయ్, మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. దాని ప్రయోజనాలేమిటో చూసేయండి మరి. 

చూసేందుకు బుజ్జిగా.. బుల్లిగా.. కాకరకాయల్లా ఉంటాయి. కానీ, రుచిలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే వీటిని ఆకాకర కాయలు లేదా బోడ కాకర అని పిలుస్తారు. వీటిని ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే పండిస్తారు. అందుకే.. ధర కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే, ఇది శరీరానికి అందించే ఆరోగ్యం ముందు.. ధర పెద్ద లెక్క కాదు. ఆ కాకర కాయల్లో క్యాలరీలు తక్కువ. వంద గ్రాముల ఆకాకరలో కేవలం 17 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. మరి ఆకాకరతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో చూద్దామా! 

1. ఆకాకర జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

2. ఆకాకరలోని ఫొలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతాయి.

3. సాధారణ కాకర కాయ తరహాలోనే ఆకాకర కూడా డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.

4. ఆకాకర రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.

5. వర్షాకాలంలో విరివిగా లభించే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, వివిధ అలెర్జీలు దూరమవుతాయి.

6. ఆకాకర కాయలోని కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.

7. క్యాన్సర్ల బారిన పడకుండా ఆకాకర అడ్డుకుంటుంది.

8. ఆకాకరలోని విటమిన్-సి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

9. ఆకాకరలో సమృద్ధిగా లభించే ప్లవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి.

10. ఆకాకర కాయ కూర తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.

11. ఈ కాయలను తరచుగా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

12. ఆకాకరను వండేప్పుడు.. వాటిపై ఉండే బొడిపెలను తీయకూడదు. ఎందుకంటే అసలైన పోషకాలు అందులోనే ఉంటాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags