The Recruitment Process for the
'Secretariat Jobs' should be completed before Nov 10
'సచివాలయ' నియామక ప్రక్రియ 10లోగా పూర్తి చేయాలి
గ్రామ, వార్డు
సచివాలయ ఉద్యోగుల నియామక ప్రక్రియ నవంబరు 10వ తేదీ లోగా పూర్తి చేయాలని జిల్లా
యంత్రాంగాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్
గిరిజా శంకర్ గురువారం ఆదేశించారు. ఇందుకోసం అనుసరించాల్సిన విధానం పైనా పలు
సూచనలు చేశారు. జిల్లాల్లో ఖాళీల మేరకు మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేసిన
అభ్యర్ధులకు సమాచారాన్ని పంపి వచ్చే నెల 2 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు
ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంపికైన వారందరికీ 11న కలెక్టర్లు నియామక పత్రాలు
అందజేస్తారని తెలిపారు. రాత పరీక్ష ఫలితాలపై సందేహాల నివృత్తి కోసం కమిషనర్
కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగానికి గురు వారం పలువురు అభ్యర్థులు
పోస్టు చేశారు. కటాఫ్ మార్కులు తొలగించడంపై కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు
తమ ఫిర్యాదులను కమిషనర్ కార్యాలయానికి మెయిల్ చేశారు.
0 Komentar