Three Nobel laureates in physics for
research on black holes and galaxies
బ్లాక్ హోల్స్, గెలాక్సీపై
పరిశోధనలకు ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే
నోబెల్ బహుమతులను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటిస్తోంది. వరుసగా
మెడిసిన్,
ఫిజిక్స్‌లో విజేతలను ఇప్పటి వరకు ప్రకటించింది.
ఈ ఏడాదికి గానూ ఫిజిక్స్‌లో నోబెల్
పురస్కారం ముగ్గుర్ని వరించింది. బ్లాక్ హోల్స్, పాలపుంతపై
పరిశోధనలకు గానూ రోజర్ పెన్‌రోజ్, రీనార్డ్ జెంజెల్, ఆండ్రియా గెట్జ్‌లను ఈ ఏడాది నోబెల్‌కు ఎంపిక చేశారు. బ్లాక్‌హోల్స్‌పై
అనేక సంవత్సరాలుగా ఈ ముగ్గురు విశేష పరిశోధనలు చేస్తున్నారని రాయల్ స్వీడిష్
అకాడమీ ప్రశసించింది. బ్లాక్ హోల్స్ సాపేక్ష సిద్ధాంతానికి బలమైన ఆధారాలను
కనుగొన్నారని తెలిపింది. బ్రిటన్‌కు చెందిన రోజర్ పెన్‌రోజ్ ఆక్స్‌ఫర్డ్
యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నారు.
పాలపుంత మధ్యలో సూపర్ మాసివ్
కాంపాక్ట్ ఆవిష్కరణకు జర్మనీకి చెందిన రీనార్డ్ జెంజెల్, అమెరికాకు
చెందిన ఆండియా గెట్జ్‌లను ఎంపిక చేశారు. ప్రైజ్ మనీని రెండు భాగాలుగా విభజించి ఒక
భాగం రోజర్ పెన్‌రోజ్‌కి, మిగతా భాగాన్ని జెంజెల్, గెట్జ్‌లకు చెరిసగం అందజేయనున్నారు. అనుకున్న సమయం కంటే కాస్తా ఆలస్యంగానే
రాయల్ స్వీడిష్ అకాడమీ నోబెల్ విజేతలను ప్రకటించింది. వాస్తవానికి స్థానిక కాలమానం
ప్రకారం.. ఉదయం 11.45కి ప్రకటించాల్స ఉన్నా కాస్త ఆలస్యం
అయ్యింది.
ఏటా అక్టోబరు తొలివారం నోబెల్
విజేతలను ప్రకటించి, డిసెంబరు 10 వీటిని
అందజేస్తారు. తొలుత మెడిసిన్‌లో విజేతలను ప్రకటిస్తారు. ఈ ఏడాది మెడిసిన్‌లో
ముగ్గురికి సంయుక్తంగా నోబెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్ల
మందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి కారణమవుతున్న ‘హెపటైటిస్ సి’ వైరస్‌ను
కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలను ఎంపిక చేశారు. 1970, 1980ల
నాటి వీరి పరిశోధనల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలు నిలిచాయని అవార్డు
ఎంపిక కమిటీ కొనియాడింది. అమెరికాకు చెందిన హార్వీ జె ఆల్టర్, చార్లెస్ ఎం రైస్, బ్రిటన్‌లో జన్మించిన మైఖేల్
హౌటన్‌లకు ఈ ఘనత దక్కింది.
0 Komentar