Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Trump admin proposes to scrap computerised lottery to select H-1B visas

 


Trump admin proposes to scrap computerised lottery to select H-1B visas

హెచ్-1బీ వీసాలపై ట్రంప్ మరో నిర్ణయం.. లాటరీ ద్వారా జారీకి స్వస్తి!

ఐటీ పరిశ్రమల్లో నైపుణ్యం కలిగి విదేశీ ఉద్యోగులను అరికట్టే నిబంధనలను ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, ఈ అంశంపై మరో కీలక ప్రతిపాదనను తీసుకొచ్చింది. 

ఇమ్మిగ్రేషన్‌ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. హెచ్-1బీ వీసాల మంజూరులో ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దుచేయనున్నట్టు ట్రంప్ యంత్రాంగం తెలిపింది. దాని స్థానంలో వేతన స్థాయి ఆధారిత వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ విడుదల చేసిన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ .. దానిపై నెల రోజుల్లోగా స్పందనలు తెలియజేయవచ్చునని పేర్కొంది. మరో మూడు రోజుల్లోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ట్రంప్‌ సర్కారు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది.

విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించేందుకు హెచ్‌-1బి వీసా వీలు కల్పిస్తుంది. భారత్‌ సహా పలు దేశాల నుంచి లక్షలాది మంది ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. ఏటా 65 వేల మందికి కంప్యూటరైజ్డ్‌ లాటరీ విధానంలో వీసాలు జారీ చేస్తారు. అయితే- ఈ విధానం ద్వారా తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులను సంస్థలు రప్పించుకోవడంతో అమెరికా పౌరులు ఉపాధి కోల్పోతున్నారని ట్రంప్‌ సర్కారు భావిస్తోంది. దీంతో లాటరీ విధానానికి స్వస్తి పలకాలని తాజాగా ప్రతిపాదించింది. 

ఇకపై వేతనాల ప్రాతిపదికన వీసా జారీ చేయాలని భావిస్తోన్నట్టు పేర్కొంది. అత్యధిక వేతనాలు లభించే నిపుణులకే వీసాలు పొందడానికి నూతన విధానం దోహదం చేస్తుందని పేర్కొంది. తద్వారా అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కలిగి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అభిప్రాయపడింది. ఇప్పటికే డిసెంబరు 31 వరకు హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాల మంజూరుపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

ఈ ప్రతిపాదిత నిబంధనలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ అమెరికా కార్మికుడిని రక్షించాలన్న వాగ్దానాన్ని ట్రంప్ యంత్రాంగం కొనసాగిస్తోంది. H-1B ప్రోగ్రామ్ తరుచూ అమెరికా సంస్థలు, క్లయింట్లు దోపిడీకి గురవుతోంది.. ప్రధానంగా విదేశీ కార్మికులను నియమించుకోవాలని, తక్కువ వేతనాలు చెల్లించాలని కోరుకుంటుంది’ అని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిప్యూటీ సెక్రెటరీ కెన్ కుకైనెల్లీ అన్నారు. 

Previous
Next Post »
0 Komentar

Google Tags