TS-CPGET-2020- 100 Marks
Question Paper for M.P.Ed
సీపీజీఈటీ 2020 - ఎంపీఎడ్ లో ఈ సారి 100 మార్కుల ప్రశ్నపత్రం
రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల
పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న కామన్ పిజి ప్రవేశ
పరీక్ష(సీపీ గెట్)లో ఈసారి రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎంపీఎడ్)కు 100 మార్కుల ప్రశ్నపత్రం ఉండనుంది. గతేడాది వరకు 75 మార్కులకు
పరీక్ష ఉండేది. మిగిలిన 25 మార్కులను క్రీడా పోటీల్లో
సాధించిన ధ్రువపత్రాలకు కేటాయించేవారు. కరోనా కారణంగ ఈ సారి ఆ విధానాన్ని
తొలగించామని సీపీ గెట్ కన్వీనర్ ఆచార్య ఎన్. కిషన్ తెలిపారు. అదేవిధంగా ఈసారి
నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎంపి డెవలప్ మెంట్ స్టడీస్ కోర్సును
కొత్తగా ప్రవేశ పెడుతున్నారని, దాన్ని చదవాలనుకునే వారు
మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW) పరీక్షకు హాజరవ్వాలన్నారు. ఈ
నెల 19వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవాలనీ,
నవంబరు 1-14 తేదీల మధ్య పది రోజులపాటు ప్రవేశ
పరీక్షలు ఉంటాయని ఆయన వివరించారు.
0 Komentar