TS DEECET 2020 Results, Rank Cards
Released
తెలంగాణ డీసెట్ 2020 ఫలితాలు ర్యాంక్ కార్డులు విడుదల
డీఈఈసెట్
కౌన్సెలింగ్‌కు 5,857 మందికి అర్హత
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ
ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్
(డీపీఈఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు అక్టోబరు 23 న వెల్లడయ్యాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో కలిపి మొత్తం 5,857 మంది అర్హత
సాధించారు. రాసిన మాధ్యమంలోని కోర్సుల్లో మాత్రమే ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది.
వారు కౌన్సెలింగ్‌కు హాజరై కన్వీనర్ కోటా కింద సీట్లు పొందొచ్చు.
తెలుగు మాధ్యమంలో 3335 మందికి 2341 (70.19 శాతం) మంది అర్హత సాధించారు.
తెలుగు విభాగంలో ఎస్.నవీన 63 మార్కులు సాధించి మొదటి
ర్యాంకు దక్కించుకుంది. ఆంగ్ల మాధ్యమంలో 3,979కి 3,158 మంది (79.36శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. గండ్ల
సాకేత్‌కుమార్ 74 మార్కులు పొంది మొదటి స్థానాన్ని
సాధించాడు. ఉర్దూ మాధ్యమంలో 1,199 మందికి 358 మంది (29.85 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో
73 మార్కులతో హబీబా మొదటి స్థానాన్ని సాధించింది. అక్టోబరు 24 నుంచి ర్యాంకు కార్డులు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని, కౌన్సెలింగ్ తేదీలు త్వరలో వెల్లడిస్తామని కన్వీనర్ కృష్ణారావు
తెలిపారు.
0 Komentar