Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS GOVT JOBS: Green Signal for 12 Thousand Jobs in Telangana

 


TS GOVT JOBS: Green Signal for 12 Thousand Jobs in Telangana

తెలంగాణలో 12 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

ఉద్యోగ ఖాళీలను ప్రతి 6 నెలలు లేదా ఏడాదికోసారి భర్తీ చేసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

12 వేల వైద్య పోస్టుల భర్తీకి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం 

వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులు భర్తీ చేయడానికి అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులు క్లియర్‌ అయ్యాయి. దీంతో వాటన్నిటినీ భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ బలోపేతంపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 

అలాగే ఖాళీలను ప్రతి 6 నెలలు లేదా ఏడాదికోసారి భర్తీ చేసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అందువల్ల ఇక నుంచి డాక్టర్ల కొరత ఉండబోదని ఉపసంఘం స్పష్టం చేసింది. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షత వహించారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags