TS - JNTU to Allow Engineering Counselling
for 35 Marks in Inter: High Court Orders
ఇంటర్ లో 35 మార్కులొచ్చినా
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కు అనుమతించండి రాష్ట్ర ప్రభుత్వం, జేఎన్టీయూకు
హైకోర్టు ఆదేశం
కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియట్
పరీక్షలు రాయలేకపోయినందున... 35 మార్కులు వచ్చిన విద్యార్థులనూ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
కు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు జేఎన్టీయూని హైకోర్టు ఆదేశించింది.
అప్పటి వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించరాదంటూ న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు
బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఇంటర్లో 45 మార్కులు వచ్చిన వారినే కౌన్సెలింగ్
కు అనుమతిస్తామంటూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డి.సాకేత్ చైతన్య దాఖలు చేసిన
పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు
నిర్వహించలేకపోయారని, విద్యార్థులకు 35 మార్కుల చొప్పున వేశారని,
దీంతో పిటిషనర్లను కౌన్సెలింగ్ కు అనుమతించడం లేదని పిటిషనర్ తరపు
న్యాయవాది నివేదించారు. 45 మార్కులు వచ్చిన వారినే కౌన్సెలింగ్ కు అనుమతిస్తామన్న
నిబంధనను సవరిస్తామని, 35 మార్కులు వచ్చిన వారినీ
కౌన్సెలింగ్ కు అనుమతించేలా 2 రోజుల్లో ప్రభుత్వం జీవో జారీచేస్తుందని అడ్వొకేట్
జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. రెండో విడత కౌన్సెలింగ్ ను కూడా అప్పటి వరకు
నిర్వహించమని తెలిపారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రెండో విడత కౌన్సెలింగ్ ను
జేఎన్టీయూ, ప్రభుత్వం వాయిదా వేసినట్లు సమాచారం.
0 Komentar