TS: NMMS 2020-21 Application Released
మెరిట్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు
చేసుకోండి.. పూర్తి వివరాలు ఇవే..!
NMMS scholarship 2020-21: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్) కింద ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న 8వ తరగతి విద్యార్థులు నవంబరు 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
రెసిడెన్షియల్ వసతి లేని అన్నిరకాల సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదివే విద్యార్థులు దీనికి అర్హులని తెలిపారు. అలాగే తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,50,000 లోపు ఉండాలి. జనరల్, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100, మిగిలిన వారికి రూ.50 ఉంటుంది. పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఏడాదికి రూ.12 వేల చొప్పున 9, 10వ తరగతితో పాటు ఇంటర్‌లో రెండేళ్లు కలిపి మొత్తం నాలుగు సంవత్సరాల పాటు ఉపకార వేతనం అందుతుంది. పూర్తి వివరాలకు https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్ చూడాలని ఆయన సూచించారు.
పూర్తి వివరాలకు నోటిఫికేషన్:
0 Komentar