Common Post Graduate Entrance Tests (CPGET)
2020 Examination Schedule Out
CPGET 2020: నవంబర్ 6 నుంచి టీఎస్ పీజీ ప్రవేశపరీక్షలు
పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీగెట్– 2020 పరీక్ష తేదీలను ఓయూ విడుదల చేసింది.
తెలంగాణలోని ఎనిమిది యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)– 2020 తేదీలను ఉస్మానియా యూనివర్సిటీ ఖరారుచేసింది. ఈ పరీక్షలను వచ్చేనెల 6 నుంచి 17వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. పరీక్షలు మూడుదఫాల్లో జరుగుతాయని చెప్పింది.
ఉదయం 9.30–11 గంటల వరకు, మధ్యాహ్నం 1.00 –2.30 గంటల వరకు, సాయంత్రం 4.30 –6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. వివరాలకు http://tscpget.com/ లో చూడవచ్చని వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.
పూర్తి వివరాలు:
ప్రవేశం కల్పించే కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ,
ఎంకామ్, ఎంసీజే, మాస్టర్
ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ,
పీజీ డిప్లొమా కోర్సులు, ఇంటిగ్రేటెడ్
కోర్సులు.
ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ
యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) లు సీపీజీఈటీ 2020 ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ
కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.
అర్హత: డిగ్రీ/ఇంటర్మీడియెట్
ఉత్తీర్ణత/ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
వెబ్‌సైట్: http://tscpget.com/
పరీక్షల షెడ్యూల్:
0 Komentar