123 కాలేజీలకు ఇచ్చిన
‘యూనివర్సిటీ’ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన యూజిసి విజ్ఞాన్, కే ఎల్ ల యూనివర్శిటీ హోదాల రద్దు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్
(యుజిసి) ఈరోజు సంచలన నిర్ణయం తీసుకొంది. దేశవ్యాప్తంగా 123 కాలేజీలకు ఇచ్చిన ‘యూనివర్సిటీ’ హోదాను రద్దు చేస్తున్నట్లు
ప్రకటించింది. ఇకపై ఆ కాలేజీలు తమ పేరు చివర ‘యూనివర్సిటీ’ అని వ్రాసుకోకూడదని
ఆదేశించింది. కనుక అవన్నీ మళ్ళీ కొత్తపేరు కోసం కేంద్రమానవ వనరుల శాఖకు దరఖాస్తు
చేసుకోవాలని సూచించింది. రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో డీమ్డ్
యూనివర్సిటీ హోదా కలిగిన నాలుగు కాలేజీలు దూరవిద్య ద్వారా జారీ చేసిన బిటెక్
(ఇంజనీరింగ్) డిగ్రీలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూజిసి నిర్ణయంతో
‘యూనివర్సిటీ’ హోదా కోల్పోయిన వాటిలో విశాఖపట్నంలో గీతం కాలేజీ (గాంధీ
ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ అండ్’ మేనేజ్ మెంట్), తిరుపతిలోని
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, అనంతపురంలోని శ్రీసత్యసాయి
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, గుంటూరులోని కోనేరు
లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కె.ఎల్. యూనివర్సిటీ), విజ్ఞాన్
ఫౌండేషన్ ఫర్ సైన్స్ (విట్) ఉన్నాయి.
తీగలాగితే దొంక కదిలినట్లు, డీమ్డ్
యూనివర్సిటీ హోదాతో రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలలో నాలుగు
కాలేజీలు కరస్పండ్ కోర్సు ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీలు జారీ చేయడంపై దాఖలైన పిటిషన్
పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటితో సహా దేశంలో అన్ని డీమ్డ్
యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డీమ్డ్ యూనివర్సిటీ హోదాలో రకరకాల
కోర్సులను ప్రవేశపెడుతూ అవి జారీ చేస్తున్న సర్టిఫికేట్లకు అనేక సంస్థలు
గుర్తించకపోవడంతో వాటిలో లక్షలు ఖర్చు చేసి చదువుకొని ఆ కోర్సులు పాసైన
విద్యార్ధులు, వారి తల్లితండ్రులు కంగారుపడుతున్నారు.
Sources: Link1 Link2
Sources: Link1 Link2
0 Komentar