Universities and their affiliated
colleges will reopen from November 2
విశ్వవిద్యాలయాలు, వాటి
అఫిలియేటెడ్ కాలేజీలను నవంబర్ 2 నుంచి పునః ప్రారంభం
ఆగస్టు7తో ముగియనున్న విద్యా సంవత్సరం
అకడమిక్ క్యాలెండర్, మార్గదర్శకాలు
జారీ
రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు వచ్చేనెల రెండోతేదీ నుంచి తెరుచుకోనున్నాయి. స్కూళ్లను, కాలేజీలను పునఃప్రారంభించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కోవలోనే విశ్వవిద్యాలయాలు, వాటి అఫిలియేటెడ్ కాలేజీలను కూడా తెరవనున్నారు. ఇందులో యూజీ/పీజీ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఉన్నత విద్యా సంస్థలు పనిచేస్తాయి. ఈమేరకు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్, కొవిడ్ మార్గదర్శకాలతో ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీశ్‌చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అకడమిక్ క్యాలెండర్‌ను
అనుసరించి.. యూజీ/పీజీ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్
ప్రోగ్రామ్స్ నిర్వహించే కాలేజీలలో సెకండ్ ఇయర్, థర్డ్
ఇయర్, ఫోర్త్ ఇయర్ తరగతులు నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 6వ తేదీతో
సెమిస్టర్ ముగుస్తుంది. తర్వాత సెమిస్టర్ మార్చి 25 నుంచి
ఆగస్టు 7 వరకు జరుగుతుంది. సాధారణంగా ఏప్రిల్ 30తో ముగియాల్సిన విద్యా సంవత్సరం కొవిడ్ నేపథ్యంలో ఈ సారి ఆగస్టు 7తో ముగుస్తుంది. వేసవి సెలవుల ప్రస్తావన క్యాలెండర్‌లో లేదు. మాస్కు,
ఆరు అడుగుల భౌతిక దూరం వంటి కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా
పాటించాలని స్పష్టం చేశారు.
0 Komentar