UPSC Prelims Result 2020: List of
qualifying candidates in Civil Services, IFS Prelim exam released
సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు
విడుదల
ఈ నెల 4న
జరిగిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం రాత్రి
విడుదల చేసింది. ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 8న జరిగే
మెయిన్స్ పరీక్ష కోసం డిటైల్ అప్లికేషన్ ఫామ్-1 (డీఏఎఫ్-1)ని మరోసారి దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ వెల్లడించింది. ఈ దరఖాస్తు
యూపీఎస్సీ వెబ్ సైట్ లో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని
పేర్కొంది.
డీఏఎఫ్-1
దరఖాస్తు భర్తీ చేయడానికి ముందు ఆ వెబ్ సైట్ లోని సంబంధిత పేజీలో పేరు
నమోదుచేసుకోవాలని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు మెయిన్స్
పరీక్షలకు 3-4 వారాలకు ముందు అడ్మిట్ కార్డు వెబ్ సైట్ లో
అప్లోడ్ చేయనున్నట్లు తెలిపింది. ఒకసారి డీఏఎఫ్-1 దరఖాస్తు
చేసుకున్న తర్వాత అభ్యర్థుల చిరునామా, ఈమెయిల్, ఫోన్ నెంబర్లలో మార్పులు ఉంటే ఆ విషయాన్ని కమిషన్‌కు తెలియజేయాలని
సూచించింది.
అభ్యర్థుల సహాయార్థం దిల్లీలోని
షాజహాన్ రోడ్డులోని ధోల్ పూర్ హౌస్ యూపీఎస్ సీ క్యాంపస్ లో ప్రత్యేక కౌంటర్
ఏర్పాటుచేసినట్లు పేర్కొంది. ప్రిలిమ్స్, మెయిన్స్ కి సంబంధించి
ఏదైనా సమాచారం, వివరణ కావాల్సిన వారు పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో 011-23385271,
011-23098543, 011-23881125 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని యూపీఎస్సీ ఒక
ప్రకటనలో తెలిపింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్
ప్రిలిమినరీ (IFS) పరీక్ష ఫలితాలను కూడా శుక్రవారం ప్రకటించారు.
0 Komentar