US FDA Approves Remdesivir as First Drug
to Treat Coronavirus
కరోనా తొలి ఔషధానికి ఆమోదం
కొవిడ్-19
రోగులకు చికిత్స అందించే తొలి ఔషధానికి గురువారం అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా
ఇస్తున్న యాంటీవైరల్ డ్రగ్ రెమిడెసివిర్ను పూర్తిస్థాయి కరోనా ఔషధంగా
వినియోగించేందుకు అనుమతించింది. దీంతో కరోనా చికిత్సకు ఆమోదం పొందిన తొలి ఔషధంగా
రెమిడెసివిర్ నిలిచింది.
కాలిఫోర్నియా కేంద్రంగా
పనిచేస్తున్న ప్రముఖ ఔషధ తయారీ సంస్థ గిలీద్ సైన్సెస్ రెమిడెసివిరను వెక్లరి పేరిట ఉత్పత్తి చేస్తోంది. కొవిడ్-19
బాధితులు కోలుకునే సమయాన్ని ఇది 15 నుంచి 10 రోజులకు తగ్గిస్తున్నట్లు అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్ఐ హెచ్)
ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అధ్యయనాల్లో తేలింది. కరోనా బారిన పడ్డ అమెరికా
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం చికిత్సలో భాగంగా రెమిడెసివిర ను తీసుకున్నారు.
12 ఏళ్లు పైబడి, కనీసం 40 కిలోల బరువున్న వారికి ఈ ఔషధాన్ని
ఇవ్వొచ్చని తెలిపారు. అలాగే, కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన
వారికి మాత్రమే దీన్ని అందించాలి. 12 ఏళ్ల కంటే తక్కువ
వయసున్న వారికి ముందు తరహాలోనే అత్యవసర అనుమతి కింద ప్రయోగాత్మకంగా అందించొచ్చు.
శరీరంలో కరోనా వైరస్ పునరుత్పత్తి కాకుండా ఈ ఔషధం అడ్డుకుంటున్నట్లు అధ్యయనంలో
గుర్తించారు. అయితే, దీన్ని యాంటీ మలేరియా మందు
హైడ్రాక్సీక్లోరోక్విన్ తో మాత్రం ఉపయోగించొద్దని హెచ్చరించారు. హెచ్ సీక్యూ
రెమిడెసివిర్ ప్రభావాన్ని తగ్గిస్తుందని తెలిపారు.
మరోవైపు కొవిడ్ బాధితులను మరణం
నుంచి బయటపడేయడంలో రెమిడెసివిర్ దోహదం చేయడం లేదని తమ అధ్యయనంలో తేలినట్లు ప్రపంచ
ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ధర విషయానికి వస్తే.. 'రెమ్
డాక్ పేరుతో జైడస్ క్యాడిలా 100 ఎంజీ పరిమాణం గల ఒక వయలను
రూ.2800 అని ప్రకటించింది. హెటిరో సంస్థ దీన్ని 'కొవిఫర్' పేరిట రూ.5,400కు
విక్రయిస్తోంది. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం రెమిడెసివిర్ గరిష్ట
ధరను రూ.2,360 గా నిర్ణయించింది.
0 Komentar