Village Secretariat ANMs as ‘ArogyaMitra’
ఆరోగ్యమిత్రలుగా గ్రామ సచివాలయ
ఏఎన్ఎంలు
- ఆరోగ్యశ్రీ అమలులో కీలక పాత్ర
గ్రామ, వార్డు
సచివాలయాల్లో నియమితులైన ఏఎన్‌ఎంలను ఇకపై ఆరోగ్యమిత్రలుగా కూడా కొనసాగించాలని
ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 13 వేల మంది ఏఎన్ఎంలు
గ్రామ సచివాలయాల్లో నియామకాలు పొందారు. వీరికి ఆరోగ్య మిత్రలుగా ఎలా విధులు
నిర్వహించాలో శిక్షణ ఇస్తారు. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు.
విధులు
- ఎవరైనా ఆరోగ్యశ్రీ కింద
వైద్యం చేయించుకోవాలంటే వాళ్లకు సరైన సమాచారం ఇవ్వాలి. గ్రామ సచివాలయానికి వచ్చే
రోగులకు ఎక్కడ సేవలు ఉంటాయో, ఎక్కడ ఆపరేషన్లు చేస్తారో
చెప్పాలి.
- ఆస్పత్రులు
ఎక్కడెక్కడున్నాయో వివరాలుండాలి. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రతో సమన్వయం
చేసుకోవాలి. అత్యవసరం అని భావిస్తే వెంటనే 108లో ఆస్పత్రికి
పంపించాలి. జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉన్నాయో లేదో, ఏ జబ్బుకు ఏ
ఆస్పత్రిలో వైద్యం చేస్తారో వారికి చెప్పి అక్కడకు పంపించాలి.
0 Komentar