Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

What is pulse oximeter and how it works?

 


What is pulse oximeter and how it works?

పల్స్ ఆక్సీమీటర్ అంటే ఏమిటీ? దీన్ని తప్పకుండా కొనాలా? ప్రయోజనాలేమిటీ?

పల్స్ ఆక్సీమీటర్ కొనాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారా? అయితే, మీరు తప్పకుండా ఇది తెలుసుకోవాల్సిందే. ఇదంతా చదివిన తర్వాత మీకు తప్పకుండా ఈ పల్స్ ఆక్సీమీటర్‌పై స్పష్టత వస్తుంది. 

పల్స్ ఆక్సీమీటర్.. కరోనా వైరస్ సీజన్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇంట్లో జ్వరాన్ని పరీక్షించుకోడానికి థర్మామీటర్ ఎంత ముఖ్యమో.. వైరస్ వంటి మహమ్మారి వల్ల శరీరంలో కలిగే అంతుచిక్కని మార్పులను కనుగొనేందుకు ఈ పల్స్ ఆక్సీమీటర్ కూడా ముఖ్యమేనని అంటున్నారు. దీని ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించి అప్రమత్తంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు. అయితే, ఇది కేవలం వైరస్‌కు మాత్రమే కాదు.. మరెన్నో అనారోగ్య సమస్యలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. అదెలాగో చూడండి. 

పల్స్ ఆక్సీ మీటర్ అంటే?: మనం బతికేందుకు ఆక్సిజన్ ఎంత ముఖ్యమో తెలిసిందే. శరీరంలో అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే ఆక్సిజన్ ఉండాలి. లేనట్లయితే శరీరంలోని కణాలు అదుపుతప్పి నాశమవుతాయి. అదే జరిగితే అవయవాలు పనిచేయడం ఆగిపోయి మరణానికి దారితీస్తుంది. 

మనం పీల్చే గాలి ఊపిరితీత్తుల్లోకి ఫిల్టర్ అవుతుంది. ఆ తర్వాత ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ప్రోటీన్స్ ద్వారా శరీరమంతటికి ఆక్సిజన్ సరఫరా అవుతుంది. పల్స్ ఆక్సీమీటర్లు.. ఈ హిహోగ్లోబిన్‌లో ఉండే ఆక్సిజన్ శాతాన్ని లెక్కిస్తాయి. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నట్లయితే అప్రమత్తమై వైద్యం పొందేందుకు ఈ మీటర్లు ఉపయోగపడతాయి. 

ఈ పరికరాన్ని ‘పల్స్ ఆక్స్’ అని కూడా పిలుస్తారు. ఇది చిన్న క్లిప్ తరహాలో ఉంటుంది. దీన్ని చేతి వేలు గోరు పైభాగానికి పెట్టుకోగానే సెకన్ల వ్యవధిలో ఇది రీడింగులను చూపిస్తుంది. ఆరోగ్యవంతుల్లో ఆక్సిజన్ శాతం 95 నుంచి 99 శాతం ఉంటుంది. 

ఎలా పనిచేస్తుంది?:

ఇది మీ వేలిలోని రక్తకేశ నాళికల్లోకి పరారుణ(ఇన్‌ఫ్రారెడ్) కిరణాలను పంపుతుంది. అందులో ప్రతిబింబించే కాంతి ద్వారా ఆక్సిజన్ శాతాన్ని కొలుస్తుంది. ఇది SpO2 అనే ఇది సంతృప్త రక్తం శాతాన్ని చూపిస్తుంది. ఆక్సిమీటర్ హృదయ స్పందన రేటును కూడా చూపిస్తుంది. ఆక్సీమీటర్‌ను ఎక్కువగా చూపుడు వేలుకు పెట్టుకుంటారు. అయితే, మీరు మధ్య వేలుకు సైతం పెట్టుకుని రీడింగ్ తీసుకోవచ్చు. పల్స్ ఆక్సీమీటర్ 98 శాతం ఖచ్చితమైన రీడింగ్ ఇస్తుందని, లోపం కేవలం 2 శాతమేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. అది చూపించే రీడింగ్‌లో రెండు శాతం ఎక్కువ లేదా తక్కువగా భావించాలి. 

కచ్చితంగా కొనాలా?: దీన్ని కొనుగోలు చేయాలా లేదా అనేది మీ ఆరోగ్యం.. మీ ప్రాంతంలో వైరస్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీన్నీ ఉపయోగించాలనే నిర్ణయం తీసుకోడానికి ముందు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. మీ ఆరోగ్య పరిస్థితికి ఆక్సీమీటర్ ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే.. ఆరోగ్యవంతులకు ఈ మీటర్‌తో పెద్దగా పని ఉండదు. ప్రస్తుతం వైరస్ విజృంబిస్తున్న నేపథ్యంలో దీని వాడకం పెరిగింది. ఈ పరికరం ఎలాంటి నొప్పి కలిగించదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి సులభంగానే వాడవచ్చు.

ఎవరు ఎక్కువగా వాడతారు?: శాస్వకోస సంబంధిత సమస్యలతో బాధపడేవారు లేదా హృద్రోగులు వైద్యులు సలహా మేరకు వీటిని ఉపయోగిస్తారు. వారి రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినట్లయితే.. అప్రమత్తంగా ఉండేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. అలాగే అప్పుడే పుట్టిన శిశువులకు సైతం పల్స్ ఆక్సీమీటర్లు ఉపయోగిస్తారు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, వైరస్ బాధితులకు సైతం వీటిని ఉపయోగిస్తున్నారు. 

ఎంత స్థాయిలో ఉండాలి?: వైరస్ వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయని, పల్స్ ఆక్సీమీటర్ ద్వారా దాన్ని గుర్తించవచ్చని చెబుతున్నారు. వైరస్ సోకిన అనుమానాలు ఉన్నట్లయితే.. ఆక్సీమీటర్‌ ద్వారా పరీక్షించుకోవచ్చు. ఆక్సిజన్ శాతం 90 నుంచి 92 శాతం స్థిరంగా ఉన్నట్లయితే.. ఎలాంటి సమస్య లేనట్లు అని తెలుపుతున్నారు. ఒక వేళ అది స్థిరంగా లేకుండా తగ్గుతున్నట్లయితే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అయితే, పల్స్ ఆక్సీమీటర్‌ను ఉపయోగించే ముందు తప్పకుండా ఈ కింది విషయాలు తెలుసుకోవాలి. 

ఈ విషయాలు తెలుసుకోండి:

SpO2 స్థాయి 95 నుంచి 100 శాతం మధ్య ఉంటే సాధారణం.

95 కంటే తక్కువ రీడింగ్ ఉంటే పఠనం సాధారణం కంటే తక్కువగా భావించాలి.

90 నుంచి 95 శాతం కంటే తక్కువగా ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.

ఈ రీడింగ్ తీసుకొనే సమయంలో ఊపిరి ఎక్కువ పీల్చితే సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని చెబుతున్నారు.

ఆక్సీమీటర్లు కొన్ని ప్రతికూల కారణాల వల్ల తప్పుడు రీడింగులు ఇస్తుంటాయని నిపుణులు తెలుపుతున్నారు.

చేతులు బాగా చల్లగా ఉన్నప్పుడు రీడింగ్ తీసుకోకూడదు.

నీలం, నలుపు వంటి ముదురు నెయిల్ పాలిష్‌లు ఉన్న వేలుకు పల్స్ ఆక్సీమీటర్ పెట్టకూడదు.

కాబట్టి.. ఆక్సీమీటర్‌ను ఉపయోగించే ముందు ముదురు నెయిల్ పాలీష్‌ను తొలగించాలని సూచిస్తున్నారు.

పల్స్ ఆక్సీమీటర్ పరీక్షను కేవలం ఒక చేతి వేలుకు మాత్రమే పెట్టి తీసుకోకుండా రెండు చేతుల్లోని ఒక్క వేలుకు పెట్టి పరీక్షించండి.

వేలుపై బొడిపెలు ఉన్నా, గోరింటాకు వంటి ఎర్రని రంగులు ఉన్నా.. రీడింగ్ తీయకూడదు.

Previous
Next Post »
0 Komentar

Google Tags