Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WHO lauds Aarogya Setu app, says it helped to identify Covid-19 clusters

 


WHO lauds Aarogya Setu app, says it helped to identify Covid-19 clusters

ఆరోగ్య సేతు యాప్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రశంసలు

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్య సేతు యాప్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. 

కరోనా మహమ్మారితో పోరులో భాగంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) ప్రశంసలు కురిపించింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఈ యాప్‌ మెరుగ్గా పనిచేస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ కితాబిచ్చారు. 150 మిలియన్ల (15 కోట్లు) మంది యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం, పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడానికి ఈ యాప్ దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. 

ఆరోగ్య సేతు యాప్‌ను 150 మిలియన్ల మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను (క్లస్టర్లు) గుర్తించడంలో ప్రభుత్వ ఆరోగ్య శాఖలకు ఈ యాప్‌ ఎంతగానో సాయపడుతోంది. తద్వారా విస్తృత కరోనా పరీక్షల నిర్వహణ సులభతరం అవుతోంది. టార్గెటెడ్ ఏరియాల్లోనే టెస్టులు నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలైంది’ అని టెడ్రోస్‌ పేర్కొన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై WHO డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులను గుర్తించడంలో మొబైల్‌ అప్లికేషన్లు, ఇతర డిజిటల్‌ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్‌ రూపొందించిన ఆరోగ్య సేతు యాప్‌ గురించి ప్రస్తావించారు. 

గడిచిన నాలుగు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని టెడ్రోస్‌ తెలిపారు. ప్రధానంగా యూరప్‌, అమెరికాలో కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. 

ఆరోగ్య సేతు: అరచేతిలో కరోనా సమగ్ర సమాచారం

కరోనా ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వైరస్ వ్యాప్తి, స్వీయ నియంత్రణ చర్యలకు సంబంధించి వివరాలు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను తీసుకొచ్చింది. కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు సమీపంగా వెళ్లినప్పుడు బ్లూటూత్‌, లొకేషన్ ట్రాకింగ్‌ ఆధారంగా ఈ యాప్‌ మనల్ని అప్రమత్తం చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో కేసుల తీవ్రతను తెలుపుతుంది. ఒకవేళ మీరు కరోనా బారినపడితే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? లాంటి వివరాలు, హెల్ప్‌లైన్ నంబర్లు, రాష్ట్రాలు, నగరాల వారీగా కేసుల వివరాలు తదితరాలన్నీ ఈ యాప్ ద్వారా తేలిగ్గా తెలుసుకోవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags