World Food Day 2020: Let's stop wasting
- Starve a feeder, feed the world
నేడే వరల్డ్ ఫుడ్ డే.. వృథాను
అరికడుదాం.. నిరుపేదల కడుపు నింపుదాం..
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది
నిరుపేదలు ఆకలి కడుపుతో రోజులు గడుపుతున్నారు. ఫుడ్ వేస్టేజీని అరికట్టి అందరి
కడుపులు నింపడం మనందరి సామాజిక బాధ్యత.
కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై అవగాహన కాస్తైనా పెరిగింది. పోషకాహారాన్ని తీసుకోవాల్సిన ప్రాధాన్యతను అది నొక్కి చెబుతున్నది. అయితే అందరికీ మూడు పూటలా ఆహారం లభించడం లేదని మన కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 16) న మనం జరుపుకుంటున్న ప్రపంచ ఆహార దినోత్సవం (వరల్డ్ ఫుడ్ డే) గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ప్రతి ఏడాది అక్టోబర్ 16న వరల్డ్
ఫుడ్ డే ని జరుపుకుంటాము. యునైటైడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్
(ఎఫ్ఎవో) దీనిని 1979 లో గుర్తించింది. అప్పట్నుంచి దీనిని ప్రతి యేటా
నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో ఇది ఎఫ్ఎవో స్థాపించిన దాని గుర్తుగా
నిర్వహించినా.. తర్వాత.. ఆహార కొరత గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా
దీనిని జరుపుకుంటున్నారు. అదీ గాక ఈ ఏడాది నోబెల్ బహుమతి కూడా ప్రపంచ ఆరోగ్య
కార్యక్రమానికి రావడం దీనికి మరింత ప్రాముఖ్యతనిచ్చింది. ఆ సంస్థ ఏటా సుమారు 9
కోట్ల మంది అన్నార్థుల ఆకలి తీర్చుతున్నది.
ఈ ఏడాది వరల్డ్ ఫుడ్ డే 2020 థీమ్ :
2020: "Grow, Nourish, Sustain.
Together"
వరల్డ్ ఫుడ్ డే ప్రాముఖ్యత :
ప్రజలందరికి పోషకాహారం కల్పించాలనే
మహా సంకల్పంతో ఐక్యరాజ్యసమితి ముందుకెళ్తుంది. ప్రపంచంలోని పేద మరియు బలహీన
వర్గాలపై దృష్టి సారించి.. వారికి ఆహార భద్రత కల్పించడమే గాక.. అందరికీ పోషకాహారం
కోసం అవసరమైన చర్యలను చేపట్టడానికి అనేక అవగాహన కార్యక్రమాలను యూఎన్ చేపట్టనుంది.
కొన్ని నిజాలు..
గత మూడేళ్లలో ఆకలితో బాధపడుతున్న
వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.
అధికారిక లెక్కల ప్రకారం..
ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 13
కోట్లకు పై మాటే.
పోషకాహార లోపం, ఆహార
భద్రత లేని వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.
ఆఫ్రికన్, మద్యాసియా
దేశాల్లో అంతర్యుద్ధాల కారణంగా అక్కడ ఆకలి సమస్య తీవ్రమవుతున్నది.
మన దేశంలోనూ చాలా మంది ఆకలితో
అలమటిస్తున్నారు. మనం తినంగా మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా.. ప్యాకింగ్ చేసి
అన్నార్థులకు అందించడం ద్వారా వారి కడుపు నింపినవారిమవుతాం.
0 Komentar