Written exams are better than interviews
for Govt Jobs: Union Minister
ఇంటర్యూల కన్నా రాత పరీక్షలే
ఉత్తమం : కేంద్ర మంత్రి
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో
ఇంటర్వ్యూలను రద్దు చేసి, రాత పరీక్షలకే పెద్దపీట వేస్తున్నట్టు
కేంద్రంలో ప్రధానమంత్రి కార్యాలయానికి అనుంబంధంగా ఉన్న పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి జితేంద్రసింగ్ శనివారం తెలిపారు. మొత్తం 28
రాష్ట్రాల్లో 28 చోట్ల, ఎనిమిది
కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విధానం అమలులో ఉన్నట్లు వెల్లడించారు. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ చేసిన సూచన మేరకు ఈ
సవరణ చేశామన్నారు. ఇంటర్వ్యూల రద్దుతో ఆయా కుటుంబాలకు ఒత్తిడి, భయం తగ్గుతాయన్నారు. ఇంటర్వ్యూల్ల ఇచ్చే మార్కులపైన గతంలో పలు ఫిర్యాదులు
వచ్చేవని, ఇప్పుడు పారదర్శకత పెరిగి అవినీతి తగ్గిందన్నారు .
0 Komentar