‘YSR Bheema‘ Scheme Starts Today
వైఎస్ఆర్ బీమా పథకం నేడు ప్రారంభం
బియ్యం కార్డున్న 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి
రాష్ట్రంలో బియ్యం కార్డు ఉన్న 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే వైఎస్ఆర్ భీమా పథకాన్ని సీఎం జగన్ తన
క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల
తరఫున ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. -ఇందుకోసం రూ.500 కోట్లను ఖర్చు చేయనుంది. 18 నుంచి 70 ఏళ్లలోపు వయసు ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న లబ్దిదారులు సహజ మరణం
పొందితే రూ.2 -లక్షలు, ప్రమాదవశాత్తూ
మరణించినా, పూర్తి అంగవైకల్యం పొందినా.. రూ. 5 లక్షల బీమా పరిహారం నామినీకి అందిస్తారు. 51 నుంచి 70 ఏళ్లలోపు వయసున్న లబ్దిదారులు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా నామినీకి రూ. 3లక్షల
పరిహారం అందుతుంది. 18-70 ఏళ్లలోపు -వయసున్న లబ్దిదారులు
ప్రమాదవశాత్తూ పాక్షిక, శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.1.50
లక్షల బీమా పరిహారం అందిస్తారు.
0 Komentar