ABVKY ESI Unemployment Benefit For 3
Months
ఏబివికేవై నిరుద్యోగ భృతి.
దరఖాస్తు విధానం ఇదే..!
Atal Bimit Vyakti Kalyan Yojana: ఈఎస్‌ఐ ఆధ్వర్యంలోని పథకం ద్వారా మూడు నెలల పాటు నిరుద్యోగ భృతిని పొందొచ్చు.
ఈఎస్‌ఐ నిరుద్యోగ భృతి
మూడు నెలలపాటు నిరుద్యోగ భృతి పొందే అవకాశం
కరోనా మహమ్మారి కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. ఇలాంటి వారు కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) ఆధ్వర్యంలోని పథకం ద్వారా మూడు నెలల పాటు నిరుద్యోగ భృతిని పొందొచ్చు. ఆ పథకం పేరే అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ఏబీవీకేవై). విపత్కర పరిస్థితుల్లో ఉపాధిని కోల్పోయిన కార్మికవర్గం కోసం కేంద్రం ఈ పథకాన్ని ఈఎస్‌ఐ ద్వారా అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనున్న వాళ్లు డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది ఈఎస్‌ఐ పరిధిలోని కార్మికులకే వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:
మొదట https://www.esic.in/ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.
ఏబీవీకేవై క్లెయిమ్ పొందేందుకు
ఉద్దేశించిన విభాగంపై క్లిక్ చేయాలి.
ఆ దరఖాస్తులో నిరుద్యోగ భృతి
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనుకుంటున్నారో నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్
చేయాలి.
నిరుద్యోగ కాల వివరాలను నమోదు
చేసిన ఏబీ–1 ఫామ్ ప్రింట్ తీసుకొని అందులో ఉన్న విషయాన్ని రూ.20 స్టాంప్ పేపర్‌పై టైపు చేయించి నోటరీ చేయించాలి.
దానిపై దరఖాస్తుదారు సంతకం చేయాలి.
ఏబీ–2
అనే ఫారంనూ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.
దానిపై సంబంధిత కంపెనీ యాజమాన్యం సంతకం చేయించాలి.
నిబంధనలివే..!
యాజమాన్యం ధ్రువీకరించకపోతే పీఎఫ్
నంబర్‌ను దరఖాస్తుపై వేసి ఈఎస్‌ఐ కార్యాలయంలో సమర్పించాలి.
ఈఎస్‌ఐ కార్డు, ఆధార్
కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అఫిడవిట్‌కు జత చేయాలి.
నిరుద్యోగ భృతి కావాలనుకున్న
సమయంలో సంబంధిత దరఖాస్తుదారు ఉద్యోగం లేకుండా ఉండాలి.
ఉద్యోగం పోగొట్టుకోవడానికి ముందు
కనీసం రెండేళ్లపాటు ఆయా సంస్థల్లో పని చేసి ఉండాలి.
ఏదో ఒక కారణంతో ఉద్యోగం
పోగొట్టుకున్న వారు ఈ పథకానికి అనర్హులు.
ఉద్యోగులను తీసివేసినట్టు
యాజమాన్యాలు ధ్రువీకరించకపోతే సమీపంలోని ఈఎస్‌ఐ కార్యాలయంలో అధికారిని సంప్రదించి
పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
0 Komentar