AP: Changes in School Re-Open Schedule
ఏపి : పాఠశాలల
పునఃప్రారంభం షెడ్యూల్‌లో మార్పులు
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభం
షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ నెల 23 నుంచి ఎనిమిదో
తరగతి పిల్లలకు మాత్రమే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత
షెడ్యూల్ ప్రకారం 23 నుంచి 6,7,8
తరగతులకు క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది. 6,7 తరగతి
విద్యార్థులకు డిసెంబర్ 14 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని
ప్రభుత్వం యోచిస్తోంది. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవుల
తర్వాత తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 23
నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజు తరగతులు జరగనున్నాయి.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటన
- 8, 9 తరగతుల విద్యార్థులు
రోజు మార్చి రోజు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉండగా 10వ తరగతి
విద్యార్థులు ప్రతి రోజూ హాజరు కావాలన్నారు.
- డిసెంబరు 14 నుంచి 6,7, సంక్రాంతి తర్వాత 1-5 తరగతులు ఉంటాయని తెలిపారు.
- 1-5 తరగతులు సంక్రాంతి
తర్వాతే.
-
చలికాలం కారణంగా పాఠశాలలను 9.30 నుంచి
మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చినట్లు
తెలిపారు.
0 Komentar