AP Covid-19 Media Bulletin 06-11-2020
ఆంధ్రప్రదేశ్: 24
గంటల వ్యవధిలో 2,410 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసుల
ఉద్ధృతి కొనసాగుతోంది. పాఠశాలలు తెరిచిన తర్వాత పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు
కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 24 గంటల వ్యవధిలో 79,601 నమూనాలను పరీక్షించగా 2,410 కరోనా పాజిటివ్
కేసులు.. 11 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,38,363కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 6,768 మంది మృతి చెందారు.
కరోనా నుంచి 8,09,770 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 21,825 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
0 Komentar