AP Covid-19 Media Bulletin 13-11-2020
ఆంధ్రప్రదేశ్‌లో 8.51 లక్షలు దాటిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్దృతి తగ్గుముఖం పడుతోంది. 24 గంటల వ్యవధిలో 80,737 నమూనాలను పరీక్షించగా 1,593 పాజిటివ్ కేసులు.. 10 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,51,298కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 6,847 మంది మృతి చెందారు. కరోనా నుంచి 8,24,189 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. రాష్ట్రంలో 20,262 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 90లక్షలకుపైగా కరోనా పరీక్షలను నిర్వహించినట్లు పేర్కొంది.
0 Komentar