AP Covid-19 Media Bulletin 20-11-2020
ఆంధ్రప్రదేశ్‌లో మరో 1,221 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు
తగ్గుముఖం పడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 66,002 నమూనాలను పరీక్షించగా 1,221 కరోనా పాజిటివ్ కేసులు
నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,59,932కి చేరింది. కరోనాతో
మరో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు 6,920 మంది మృతి చెందారు. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 15,382 మంది చికిత్స పొందుతుండగా.. 8,37,630 మంది కోలుకుని
డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 94,74,870 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది.
0 Komentar