AP Govt Revised and Reduced Coronavirus Testing Prices
HM&FW Department – COVID-19
–Revision of Rates for conducting COVID– 19 Tests in Private NABL & ICMR
approved Labs – Orders –Issued.
G.O.RT.No. 699 Dated: 12-11-2020.👇
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలను ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులు ప్రయివేట్ ల్యాబ్‌లో నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే ప్రస్తుతం రూ.1,900 వసూలు చేస్తున్నారు. తాజా ధరల ప్రకారం ఇది రూ.1,000గా నిర్ణయించింది. అలాగే, ప్రభుత్వం పంపిన నమూనాలను పరీక్షించడానికి రూ.1,600 చెల్లిస్తున్నారు. ప్రస్తుతం దానిని రూ.800కు తగ్గించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రైవేటు ల్యాబ్స్‌కు కరోనా పరీక్షల కోసం ప్రభుత్వమే రక్త నమూనాలను పంపిస్తే పూల్ శాంపిల్స్ కూడా రూ.800 చెల్లిస్తుంది. వీటిని పరీక్షించే సమయంలో ఏదైనా శాంపిల్ పాజిటివ్ వస్తే, అందులోని అన్నింటిని రెండోసారి పరీక్షించాల్సి ఉంటుంది. దీనికి మాత్రం ప్రతి శాంపిల్‌కు రూ.800 వరకూ ప్రభుత్వం చెల్లిస్తుంది. తాజా, ధరలు ఐసీఎంఆర్ అనుమతి పొందిన ల్యాబొరేటరీలకు మాత్రమే వర్తిస్తాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే అన్ని ప్రైవేటు ల్యాబొరేటరీలు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే, అన్ని టెస్ట్‌ల ధరలను ల్యాబ్‌లు బయట ప్రదర్శించాలని స్పష్టం చేసింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను ఆరోగ్యశ్రీ సీఈవోకు ప్రభుత్వం అప్పగించింది. ఆర్‌ఎన్‌ఏ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు పూర్తి స్థాయిలో మార్కెట్లో అందుబాటులోకి రావడంతో పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను తగ్గించాలని ఆదేశించింది. ప్రభుత్వం పంపించే నమునాలను రూ.800, కరోనా అనుమానితులు నేరుగా వస్తే రూ.1,000 వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
0 Komentar