AP Grama Ward Sachivalayam Jobs 2020: Selected
Candidates for Certificate Verification, Download Call Letter, Upload
Certificates Services Enabled
ఈరోజు నుంచి ధ్రువపత్రాల పరిశీలన
ప్రక్రియ ప్రక్రియ ప్రారంభం
10వ తేదీ వరకు
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. అభ్యర్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా షార్ట్ లిస్టులను తయారు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈసారి కూడా రోస్టర్ విధానంలోనే అభ్యర్థులను భర్తీ చేయనున్నారు.
ఈరోజు (నవంబర్ 2వ తేదీ) నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభంకానుంది. గతంలో కటాఫ్ మార్కులు ప్రకటించి ఆ లోపు మార్కులు సాధించిన వారిని పోస్టులకు పిలుపునిచ్చేవారు. ఈ సారి కటాఫ్ మార్కులు లేకుండా మెరిట్, రోస్టర్ ప్రకారం షార్ట్ లిస్ట్‌ల తయారీ చేసే బాధ్యతను సంబంధిత శాఖలకే అప్పగించారు.
అనంతరం వాటిని గ్రామ/వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులై, మెరిట్ సాధించిన వారికి 1 : 2 ప్రకారం కాల్‌లెటర్లు పంపనున్నారు. అర్హుత సాధించిన అభ్యర్థులకు కాల్‌లెటర్లను వారి మెయిల్ ఐడీలకు పంపించనున్నారు.
ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు (నవంబర్ 2వ తేదీ) నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థుల షార్ట్ లిస్టు తయారు చేసి నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు కాల్‌లెటర్లు పంపుతారు. అలాగే ఈరోజు నుంచి పదో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను అదే రోజు నుంచే నియామకపత్రాలు జారీ చేయనున్నారు.
అభ్యర్థులు ఇవి తీసుకెళ్లాలి..!
కాల్ లెటర్ అందుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు ముందుగానే సంబంధిత వెబ్‌సైట్‌లో వాటిని అప్‌లోడ్ చేయాలి.
రెండు సెట్ల అటెస్ట్ చేసిన సర్టిఫికెట్స్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు వెళ్లేటప్పుడు తీసుకెళ్లాలి.
ఇటీవల జారీచేసిన క్యాస్ సర్టిఫికెట్, బీసీలు నాన్-క్రిమిలేయర్ సర్టిఫికెట్స్‌ను వెంట తీసుకెళ్లాలి.
DOWNLOAD
CALL LETTER TO ATTEND CERTIFICATE VERIFICATION
0 Komentar