Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APSRTC and TSRTC Resumes Soon

 


APSRTC and TSRTC Resumes Soon

ఆర్‌టి‌సి ప్రయాణికులకు శుభవార్త - ఏ‌పి -తెలంగాణల మధ్య బస్సులు ఇక రైట్ రైట్   

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచి పోయిన ఆర్టీసీ బస్సు సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏపీలో 1,61,258 కి.మీ. మేర టీఎస్ ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఇక తెలంగాణలో 1,60,999 కి.మీ. మేర 638 బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ నడపనుంది.

ఏపీ, తెలంగాణల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు నడపాలో స్పష్టత వచ్చింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో అవగాహన ఒప్పందంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు మాట్లాడుతూ.. “మార్చి 22న కరోనా కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర నిబంధనల ప్రకారమే బస్సులు నడిపాం. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ఒప్పందం ప్రకారం ఆర్టీసీ బస్సులు నడపబోతున్నాం. ఆర్టీసీతో పాటు గూడ్స్ ఇతర రవాణా వాహనాలు పునరుద్ధరిస్తాం. త్వరలోనే ఇంటర్ స్టేట్ టాక్స్ పేమెంట్ కోసం ఇరు రాష్ట్రాల మంత్రుల భేటీ

ఉంటుంది. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని అంటే స్పిరిట్ ఆఫ్ స్టేట్ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాలు 1లక్ష కిలోమీటర్లు నడపాలంటే కష్టమే. ఎందుకంటే కరోనా పరిస్థితులు చక్కబడి సాధారణ స్థితికి రావడానికి మరో ఆరు నెలల సమయం పట్టవచ్చు. ఒక వేళ లక్ష కిలోమీటర్లు ఇరు రాష్ట్రాలు తిప్పకపోతే మళ్లీ పునరాలోచన చేయాల్సి ఉంటుంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బస్సులను నడపాలని ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకుంటున్నాము" అని తెలిపారు.

ఒప్పందం ప్రకారం ఇలా...

లాక్ డౌనకు ముందు ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణకు నిత్యం 1,009 సర్వీసులు నడిపేది. ఇప్పుడు ఆ సంఖ్య 638కే పరిమితమైంది. దీంతో 371 సర్వీసులు తగ్గనున్నాయి. టీఎస్ఆర్టీసీ గతంలో ఏపీకి 750 సర్వీసులు నడిపేది. ఇప్పుడు 820 వరకు పెరగనున్నాయి. టీఎస్ఆర్టీసీ డిమాండు మేరకు 1.61 లక్షల కి.మీ.మేర సర్వీసులకే ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించడంతో ఆర్టీసీల ఎండీల మధ్య సోమవారం ఒప్పందం జరిగింది. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బస్సుల పర్మిట్లపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి, ఉభయ రాష్ట్రాల రవాణా శాఖల ముఖ్య కార్యదర్శుల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగేందుకు మరికొంత సమయం పడుతుందని ఏపీ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు, టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు.

7 నెలల సుదీర్ఘ విరామం

 కరోనా నేపథ్యంలో లా డౌన్ విధించటంతో మార్చి 23 నుంచి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించినప్పటికీ ఇవి పునఃప్రారంభానికి నోచుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ బస్సుల రాకపోకల కోసం రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం జరగలేదు. సమన్యాయం ప్రాతిపదికన రెండు రాష్ట్రాలు కిలో మీటర్లు, సర్వీసులు సమానంగా నడిపేందుకు ఒప్పందం చేసుకున్న తర్వాతే ఆంధ్రప్రదేశ్ కు బస్సులు నడపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేయటంతో బస్సులకు బ్రేకులు పడిన విషయం విదితమే. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడంతో సేవలను పునరుద్ధరించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags