BEL Recruitment 2020: Apply Online For
125 Project Engineer–I, Trainee Engineer And Other Posts
బెల్‌లో 125 ఇంజనీర్ పోస్టులు.. బీఈ/బీటెక్ అర్హత.. రాత పరీక్ష లేదు..!
బీఈఎల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 125 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 125 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్-1, ట్రయినీ ఇంజినీర్, ఇతర పోస్టులు ఉన్నాయి. ఈనెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://bel-india.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 125
ట్రయినీ ఇంజినీర్- 95 (ఎలక్ట్రానిక్స్-15, మెకానికల్-18, ఫైనాన్స్-2, ట్రయినీ ఇంజినీర్స్(2)-60),
ప్రాజెక్ట్ ఇంజినీర్- 30 (ఎలక్ట్రానిక్స్-25, సివిల్-2, ఎలక్ట్రికల్-2, హ్యూమన్ రిసోర్స్-1)
ముఖ్య సమాచారం:
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత
విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ, ఎంబీఏ చేసి ఉండాలి.
వయసు: నవంబర్ 1
నాటికి 25 నుంచి 28 ఏళ్లలోపు వయస్సు
ఉన్నవారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి. హార్డ్‌కాపీని ప్రింట్ తీసి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి
సంబంధిత చిరునామాకు పంపించాలి.
ఎంపిక: అకడమిక్ మార్కులు, వర్క్
ఎక్స్‌పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ట్రెయినీ
ఇంజినీర్ పోస్టులకు రూ.200, ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ
అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్
25,
2020
వెబ్‌సైట్: https://bel-india.in/
0 Komentar