RBI Report Doors Could Be Finally Open to Large Business Houses to Launch Banks
బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక
మార్పులు!
ఆర్‌బీఐ అంతర్గత కమిటీ కీలక సిఫార్సులు చేసింది. బ్యాంకింగ్ రంగంలో బడా కార్పొరేటు సంస్థలకు అధిక ప్రాధాన్యం లభించేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో పోటీ బాగా పెరగనుంది.
ఆర్‌బీఐ ప్యానెల్ సిఫార్సులు
బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఛాన్స్
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంటే అందరికీ తెలుసు. అయితే భవిష్యత్‌లో గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటారా? రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI అంతర్గత కమిటీ సిఫార్సులు ఇందుకు ముఖ్యకారణం.
ఆర్‌బీఐ ప్యానెల్ తాజాగా పలు కీలక ప్రతిపాదనలు చేసింది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు బ్యాంకింగ్ లైసెన్స్‌లు జారీ చేయాలని ఆర్‌బీఐకి సూచించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ RIL, టాటా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటివి బ్యాంకింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది.
గతంలో అయితే ఆర్‌బీఐ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వడానికి సుముఖంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆర్‌బీఐ ప్యానెల్ దీనికి భిన్నంగా ప్రతిపాదన చేయడం గమనార్హం. అంతేకాకుండా ఆర్‌బీఐ ప్యానెల్ తాజాగా మరో కీలక ప్రతిపాదన కూడా చేసింది.
రూ.50 వేల కోట్లకు పైగా అసెట్స్ కలిగిన, 10 ఏళ్లకు పైగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్న పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను బ్యాంకులకు మార్పు చేయాలని సూచించింది. ఇంకా బ్యాంకుల ప్రారంభానికి మూలధనాన్ని కూడా పెంచాలని ప్రతిపాదించింది. కనీసం రూ.1,000 కోట్లు ఉంటేనే బ్యాంక్ ఏర్పాటుకు అనుమతించాలని తెలిపింది. అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల విషయంలో కనీసం రూ.300 కోట్ల మూలధనం ఉండాలని పేర్కొంది.
ఆర్‌బీఐ ప్యానెల్ ప్రతిపాదనలను
గమనిస్తే.. బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునేలా కనిపిస్తోంది. భవిష్యత్తులో
ఆర్‌బీఐ బడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడం లేదంటే ఎన్‌బీఎఫ్‌సీలను
పూర్తి స్థాయి బ్యాంకులుగా మార్చడం వంటివి చేస్తే మాత్రం బ్యాంకుల మధ్య పోటీ బాగా
పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో కస్టమర్లకు బెనిఫిట్ ఉండొచ్చు. అయితే ఇక్కడ ఎన్‌బీఎఫ్‌సీల్లో
సంక్షోభం తలెతిత్తే.. అప్పుడు ఆ ప్రభావం దేశీ బ్యాంకింగ్ రంగంపై తీవ్రంగా ఉండే
అవకాశముంది.
0 Komentar