CA exam cannot be conducted online, says
ICAI to Supreme Court
సీఏ పరీక్షలు ‘ఆన్‌లైన్’లో నిర్వహించలేం - సుప్రీంకోర్టుకు తెలిపిన ఐసీఏఐ
రానున్న సీఏ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించడం వీలుకాదని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) సుప్రీంకోర్టుకు నవంబరు 4న తెలిపింది. తాము నిర్వహించే పరీక్షలు.. భిన్నమైన నమూనాలో జరుగుతాయని.. సమాధానాలు వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా అభ్యర్థులు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. కొవిడ్-19 నేపథ్యంలో సీఏ పరీక్షల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొంత మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానంగా.. ఐసీఏఐ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరినట్లు ఆన్‌లైన్ పరీక్షలు సాధ్యం కాదని తెలిపారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. ‘‘చాలా విషయాలను కోర్టులు అనుమతిస్తున్నాయి కాబట్టి..ప్రతీది అనుమతించమనడం సమంజసం కాదు. డిమాండ్లలో హేతుబద్ధత పాటించాలి’’ అని న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్లను మందలించింది. కొవిడ్-19కు సంబంధించి విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఐసీఏఐను ఆదేశిస్తూ.. విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.సీఏ పరీక్షలు.. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 14వరకు జరగనున్నాయి.
0 Komentar