Changes in the rules of Sports Reservations
- Government issued orders
క్రీడా రిజర్వేషన్ల నిబంధనల్లో మార్పులు - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఉద్యోగ నియామకాల్లో 2 శాతం రిజర్వేషన్లు కల్పించే నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా శాఖలో నియామకాలకు సంబంధించి ఒక పోస్టు కోసం ఇద్దరు క్రీడాకారులు సమాన అర్హతలతో పోటీ పడితే.. నియామక పరీక్షలో వారు సాధించిన ర్యాంకు ఆధారంగా రిజర్వేషన్ వర్తించేలా నిబంధనలను మార్చింది. ప్రస్తుతం, వివిధ శాఖల్లో క్రీడా రిజర్వేషన్ల కింద నియమితులైన ఉద్యోగి ఆ శాఖ తరఫున ఐదేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండేది. తాజా నిబంధనల ప్రకారం ఐదేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించడంతో పాటు.. నియామక నోటిఫికేషన్ వెలువడే నాటికి పదేళ్ల ముందు క్రీడా అనుభవం ఉంటేనే అర్హులుగా పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. క్రీడాకారులు ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొనడంతో పాటు దిగువ స్థాయిలో పతకాలు సాధించాలన్న నిబంధన కూడా ఉంది. దిగువ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించినా రిజర్వేషన్ వర్తించేలా ప్రభుత్వం మార్పులు చేసింది.
YOUTH SERVICES & SPORTS - Sports
Policy – Incentives to Sportspersons - Extension of Sports reservations to two
percent (2%) to meritorious sportspersons in direct
recruitment in Government Departments/ Undertakings / grant-in-aid Institutions
at all levels – Amendment – Orders - Issued.
G.O.Ms.No.8 Date:23/11/2020.👇
0 Komentar