D.Ed Colleges Update in Academic Year
2020-21
ఏపి లో 125 డీఈడీ కళాశాలల మూసివేత
రాష్ట్రంలో ఈ ఏడాది ప్రైవేటు డీఈడీ
(డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) కళాశాలలు భారీగా మూతపడ్డాయి. డీఈసెట్ ప్రవేశాలకు
దరఖాస్తు చేస్తున్నవారు కన్వీనర్ కోటా సీట్లలో 30 శాతం కూడా లేరు.
యాజమాన్య కోటా, స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు
పొందేవారు తప్పనిసరిగా డీఈసెట్‌లో అర్హత సాధించాలన్న నిబంధనతో ప్రైవేటు కళాశాలలకు
విద్యార్థులు దొరక్క మూసివేత తప్పలేదు.
రాష్ట్రవ్యాప్తంగా 2019- 2020లో 537 ప్రైవేటు డీఈడీ కళాశాలలుండగా.. ఈ ఏడాది 125 విద్యా సంస్థలు మూతపడ్డాయి. పాఠశాల విద్యాశాఖ 423
కళాశాలలకు అనుమతులు ఇవ్వగా వీటిలో 11 యాజమాన్యాలు తమకు
విద్యార్థులను కేటాయించవద్దంటూ స్వచ్ఛందంగా మూసివేశాయి.
2020-21 సంవత్సరానికి డీఈసెట్‌కు 10,810 మంది దరఖాస్తు చేయగా.. 9,014 మంది అర్హత సాధించారు. 412 ప్రైవేటు కళాశాలల్లో 35,080, 14 ప్రభుత్వ కళాశాలల్లో 1,650 సీట్లు ఉన్నాయి. అర్హత సాధించిన వారంతా డీఈడీలో చేరినా మొత్తం సీట్లలో 25శాతం మాత్రమే భర్తీ కానున్నాయి. ఎక్కువ మంది అభ్యర్థులు ప్రభుత్వ డైట్ కళాశాలలను ఎంచుకుంటున్నందున ప్రైవేటులో సుమారు 80 శాతం సీట్లు మిగిలిపోనున్నాయి.
0 Komentar