DGCA Recruitment 2020 – Apply for 35
Flight Operation Inspector
డీజీసీఏ: విమానయాన
శాఖలో 35 జాబ్స్.. లక్షల్లో జీతం..!
భారత ప్రభత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ఒప్పంద ప్రాతిపదికన 35 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నవంబర్ 16 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://dgca.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 35
డిప్యూటీ చీఫ్ ఫ్లయిట్ ఆపరేషన్స్
ఇన్‌స్పెక్టర్ (ఎయిరోప్లేన్)- 04
సీనియర్ ఫ్లయిట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్
(ఎయిరోప్లేన్)- 05
ఫ్లయిట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్
(ఎయిరోప్లేన్)- 23
ఫ్లయిట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ (హెలికాప్టర్)- 3
ముఖ్య సమాచారం:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
ఇంటర్మీడియట్/ గ్రాడ్యుయేషన్/ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు
టెక్నికల్ అర్హతలు, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: డాక్యుమెంట్
వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి
తేది: నవంబర్ 16, 2020.
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి
చివరి తేది: నవంబర్ 20, 2020.
చిరునామా: Recruitment
Section, A Block, Directorate General of Civil Aviation, Opposite Safdarjung
Airport, New Delhi-110 003.
వెబ్‌సైట్: https://dgca.gov.in/
0 Komentar