Adoption and Implementation of DigiLocker system in Telangana State
ITE&C Department – Digital Locker service
– Adoption and Implementation of DigiLocker system in Telangana State for
issuing citizen certificate and accepting digital certificates through
Digilocker, while providing government services to citizens - Orders – Issued.
G.O.Ms.No. 14
Dated: 04-11-2020
అన్ని శాఖలు, సంస్థలు
వాడుకోవాలని ఉత్తర్వులు సర్టిఫికెట్లు ఇక డిజిలాకర్‌లోనే
ఎక్కడికి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో
సర్టిఫికెట్లు
ఒరిజినల్ ఫార్మాట్‌లో.. ఎప్పుడైనా
తీసుకోవచ్చు
‘డిజిలాకర్’ విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2015లో కేంద్రం ప్రారంభించి అమల్లోకి తెచ్చిన ‘డిజిలాకర్’ను రాష్ట్రానికి అన్వయింపజేస్తూ రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే అంబేడ్కర్ ఓపెన్‌వర్సిటీ విద్యార్థుల మార్కుల మెమో లు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లను డిజిలాకర్‌లో పొందుపర్చింది.
ఇప్పటికే 154 డిపాజిటర్స్(ఇష్యూయర్స్) నుంచి 3.7 బిలియన్ల డాక్యుమెంట్లను డిజిలాకర్‌లోకి చేర్చారు. ఈ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినియోగించుకోవాలం టూ కేంద్రం సూచించింది. దీంతో రాష్ట్రప్రభుత్వం అన్ని శాఖలకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. డిజిలాకర్‌లో తప్పనిసరిగా ఇష్యూయర్/డిపాజిటర్‌గా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. అందుకనుగుణంగా తమ తమ సాఫ్ట్‌వేర్ విధానాన్ని, వెబ్/మొబైల్ అప్లికేషన్లను మార్చుకోవాలని కోరింది. ఇప్పటికే జారీ చేసిన సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లను డిజిలాకర్‌లోకి పుష్ చేయాలని ఆదేశించింది.
ఒక విద్యార్థికి అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ నుంచి మార్కుల మెమో కావాలనుకుంటే.. డిజిలాకర్ నుంచి పొందవచ్చు. తమ విద్యార్థుల హాల్‌టికెట్ నెంబర్ల ఆధారంగా వారి ఒరిజినల్ సర్టిఫికెట్లన్నింటినీ డిజిలాకర్‌కు పుష్ చేసి పెడుతుంది. విద్యార్థి తన ఆధార్, ఫోన్ నెంబర్ల వంటి యూనిక్ నెంబర్లతో డిజిలాకర్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవాలి. హాల్‌టికెట్ నెంబర్ ఆధారంగా వర్సిటీ రికార్డుల్లోని ఒరిజనల్ సర్టిఫికెట్లను సదరు విద్యార్థి అకౌంట్‌లోకి పుల్ చేసుకోవాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒరిజినల్ కాపీల ప్రింట్లు తీసుకోవచ్చు.
జీహెచ్‌ఎంసీ జారీ చేసే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా ఇకనుంచి డిజిలాకర్‌లోకి పుష్ చేస్తారు.
మీ-సేవా కేంద్రాలు అందిస్తున్న టాప్ టెన్ సర్వీసులకు సంబంధించిన సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లు కూడా డిజిలాకర్‌లో పెట్టనున్నారు. ముఖ్యంగా కులం, ఆదాయం, నివాస సర్టిఫికెట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.
మిగతా వర్సిటీలు, విద్యా సంస్థలు కూడా తమ విద్యార్థుల మెమోలను డిజీలాకర్‌లో ఉంచుతాయి.
స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్టర్ చేసిన ఆస్తుల డాక్యుమెంట్లను కూడా డిజిలాకర్‌లో పెడతారు.
0 Komentar