Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DRDO - DMRL Recruitment 2020: Junior Research Fellow (JRF) and Research Associate (RA) Posts

 


DRDO - DMRL Recruitment 2020: Junior Research Fellow (JRF) and Research Associate (RA) Posts

డి‌ఆర్‌డి‌ఓ – డి‌ఎం‌ఆర్‌ఎల్  హైదరాబాద్‌లో జాబ్స్‌.. రాత పరీక్ష లేదు

హైదారాబాద్‌లోని డీఆర్‌డీఓ కి చెందిన డీఎంఆర్ఎల్‌.. 21 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైదారాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్‌(డీఆర్‌డీఓ)కి చెందిన డిఫెన్స్ మెట‌ల‌ర్జిక‌ల్ రిసెర్చ్ ల్యాబొరేట‌రీ (డీఎంఆర్ఎల్‌).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 21 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. మెట‌ల‌ర్జీ/ మెటీరియ‌ల్ సైన్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మెకానిక‌ల్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులను ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 21

జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్‌)-18

రిసెర్చ్ అసోసియేట్‌(ఆర్ఏ)-03

 

ముఖ్య సమాచారం:

విభాగాలు: మెట‌ల‌ర్జీ/ మెటీరియ‌ల్ సైన్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మెకానిక‌ల్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎంఈ/ ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్: admin@dmrl.drdo.in

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 02.01.2021.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags