Engineering courses in regional
languages from next academic year in select IITs, NITs: Pokhriyal
ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య -
వచ్చే విద్యాసంవత్సరం నుంచి
దేశంలో ఇంజనీరింగ్ సహా సాంకేతిక
విద్యను ప్రాంతీయ భాషల్లో అందుబాటు లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది.
ఆ శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఉన్నతస్థాయి
సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇంజినీరింగ్ లాంటి కోర్సులను మాతృభాషలో నేర్చుకునే వెసులుబాటును విద్యార్థులకు
కల్పించేందుకే విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు
వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలుకు కొన్ని ఐఐటీ, ఎన్‌ఐటి లను
ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో CBSE, CISCE లాంటి బోర్డులు తమ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేశాయి. ఈ నేపథ్యంలో
వాటిని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్‌టిఏ) సమగ్రంగా పరిశీలించి, పోటీపరీక్షలకు సంబంధించిన పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తుందని ఈ సమావేశంలో
నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.
0 Komentar