First day student attendance 42 percent:
Minister Suresh
మొదటి రోజు విద్యార్థుల హాజరు 42శాతం: మంత్రి సురేష్
కంటెయిన్‌మెంట్ జోన్లలో మినహా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 99 శాతం పాఠశాలల్లో 88 శాతం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారని పేర్కొన్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు 39.62శాతం, పదో తరగతి వారు 43.65శాతం బడులకు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా 42 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని తెలిపారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం ఆదర్శ పాఠశాలలో రాత్రి కాపలాదారుకు, నెల్లూరు మండలం పాతవెల్లంటి ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఆయా పాఠశాలలను శానిటైజ్ చేశారని వెల్లడించారు.
పాఠశాల బస్సుల్లో సీటుకు ఒక్కరే
పాఠశాల బస్సుల్లో సీటుకు ఒక్క విద్యార్థి చొప్పున మాత్రమే కూర్చోవాలి, విద్యార్థులంతా మాస్క్, ఫేస్‌షీల్డ్ ధరించి ఉండేలా చూడాలని రవాణాశాఖ అధికారులు సూచించారు. తల్లిదండ్రులు, కుటుంబీకులే స్వయంగా పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చేలా విద్యా సంస్థలు ప్రోత్సహించాలని, తప్పనిసరిగా బస్సులు, ఆటోల్లో పంపాల్సి వస్తే మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు.
0 Komentar