Freezing of Dearness Allowance to the State Government employees and Government pensioners
ది 01-01-2020 నుండి ది
30-06-2021 మధ్య ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇవ్వాల్సిన
మూడు DA/DR లు Arrears ను నిలుపుదల
చేస్తూ ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు...
G.O.MS.No. 95
Dated: 06-11-2020
కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక
పరిస్థితులు సరిగా లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ బాటలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు
వెల్లడించింది. ఈమేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్
శుక్రవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. 2020 జనవరి, జులై ఒకటో తేదీల నుంచి ఇవ్వాల్సిన రెండు డీఏలతోపాటు 2021 జనవరి ఒకటి నుంచి ఇవ్వాల్సిన మరో డీఏ కూడా ఇవ్వబోమన్నారు. తిరిగి 2021 జులై నుంచి కొత్త డీఏలు ఇస్తామన్నారు. ప్రస్తుతం నిలిపేసిన మూడు డీఏలను
అప్పుడే పునరుద్ధరిస్తామన్నారు. అయితే వీటి బకాయిలను ఇవ్వలేమన్నారు. అదే సమయంలో 2021 జులై 1నాటి కరవు పరిస్థితులకు అనుగుణంగా అప్పటి
నుంచి ఎంత కరవు భత్యం వర్తిస్తుందో ఆ మేరకే కొత్త డీఏల అమలు ఉంటుందని
స్పష్టంచేశారు. ఉద్యోగులకు 2018 జులై 1
నుంచి 3.144% మేర ఇటీవల మంజూరు చేసిన డీఏ యథాతథంగా అమలు
కానుంది.
0 Komentar