Good News for PF Subscribers EPFO Likely
to Credit 8.5 Percent 1st Installment On Diwali
PF ఖాతాదారులకు అదిరిపోయే
దీపావళి శుభవార్త! అకౌంట్లలోకి డబ్బులు?
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి శుభవార్త అందించేందుకు రెడీ అవుతోంది. 8.5 శాతం వడ్డీ మొత్తంలో తొలి విడత డబ్బులను దీపావళి కల్లా పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయనుంది.
పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి
తీపికబురు
దీపావళి కల్లా వడ్డీ డబ్బులు
అకౌంట్లలో జమ
డిసెంబర్‌లో మరో విడత డబ్బులు
పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి
తీపికబురు అందనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు గుడ్
న్యూస్ అందించేందుకు రెడీ అవుతోంది. పండుగ సీజన్‌లో పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో
డబ్బులు జమ చేయనుంది.
2019-20 ఆర్థిక సంతవ్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ రేటు అందిస్తామని ఈపీఎఫ్‌వో గతంలోనే ప్రకటించింది. అయితే ఈ వడ్డీ డబ్బులను ఒకేసారి కాకుండా రెండు విడతల్లో పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమచేస్తామని ఈపీఎఫ్‌వో పేర్కొంది. తొలి విడతలో 8.15 శాతం వడ్డీ మొత్తాన్ని, రెండో విడత కింద మిగిలిన 0.35 శాతం వడ్డీ మొత్తాన్ని పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమకానుంది.
పండుగ సీజన్ నేపథ్యంలో ఈపీఎఫ్‌వో తన పీఎఫ్ ఖాతాదారులకు తొలి విడత వడ్డీ మొత్తాన్ని దీపావళి కల్లా వారి అకౌంట్లలో జమచేనుంది. ఇక మిగతా 0.35 శాతం మొత్తాన్ని ఈపీఎఫ్‌వో డిసెంబర్ చివరి నాటి కల్లా పీఎఫ్ ఖాతాదారుల పీఎఫ్ అకౌంట్లలో క్రెడిట్ చేయనుంది.
ఇకపోతే పీఎఫ్ అకౌంట్లో డబ్బులు
క్రెడిట్ అయ్యయా? లేదా? అనే విషయాన్ని
సులభంగానే తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ
మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. లాగిన్
అయిన తర్వాత పాస్‌బుక్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి మీ అకౌంట్‌లో
వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? లేదా? అని
తెలుసుకోవచ్చు.
0 Komentar