Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Google: Application Engineering Intern, Summer 2021

 


Google: Application Engineering Intern, Summer 2021

బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్... గూగుల్‌లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం 

హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశమిస్తోంది గూగుల్. ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. https://careers.google.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 11 చివరి తేదీ. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన వారు ఇండియాలోనే ఉండాలి. ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని అభివృద్ధి చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ సొల్యూషన్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అందించాలి. 

ఇంటర్న్‌షిప్ వివరాలు ఇవే...

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 11 

విద్యార్హతలు- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు దరఖాస్తు చేయాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు మాత్రమే అప్లై చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి. 

ఇతర అర్హతలు- జావా, సీ++, పైథాన్‌లో అనుభవం ఉండాలి. సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ లేదా ఆల్గరిథమ్స్ తెలిసి ఉండాలి. వీటితో పాటు SQL, Spring, Hibernate, Web Services (RESTful, SOAP), JavaScript తెలిసి ఉండాలి. 

ఇంటర్న్‌షిప్ గడువు- 12 నుంచి 14 వారాలు

ఇంటర్న్‌షిప్‌కు అప్లై చేయండి ఇలా 

గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేయాలనుకునే విద్యార్థులు https://careers.google.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో Application Engineering Intern, Summer 2021 సెర్చ్ చేయాలి. అందులో హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. అందులో ఇంటర్న్‌షిప్ వివరాలు ఉంటాయి. పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. విద్యార్హతలు ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేయాలనుకుంటే Apply పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. మీ సీవీ లేదా రెజ్యూమె అప్‌లోడ్ చేయాలి. మీ విద్యార్హతల వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి. హైదరాబాద్‌, బెంగళూరు క్యాంపస్‌లకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మీరు సబ్మిట్ చేసే ఒకే అప్లికేషన్ అన్ని లొకేషన్లకు వర్తిస్తుంది.

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags