Google Photos Abandons Unlimited Uploads
Amid Storage Changes
గూగుల్ ఫొటోల సేవలు పొందాలంటే ఇకపై
డబ్బులు
దాదాపు ఐదేళ్లుగా ఉచితంగా
అందుబాటులో ఉన్న గూగుల్ ఫొటోల సేవలు పొందాలంటే ఇకపై డబ్బులు చెల్లించాల్సి
ఉంటుంది. మనకు నచ్చిన ఫొటోలను సింక్ చేసుకుంటే అవి క్లౌడ్ అకౌంట్ లో నిక్షిప్తం
అవుతాయి. సంబంధిత జీమెయిల్ తో అనుసంధానమైన ఏ పరికరంలోనైనా వీటిని ఓపెన్ చేసే
వీలుంటుంది. అయితే 15 జీబీ స్టోరేజీ దాటిన తర్వాత గూగుల్ ఫొటోలో
డేటాను దాచుకోవాలనుకుంటే కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని గూగుల్
వెల్లడించింది. ఈ మేరకు అధికారిక బ్లాగులో పేర్కొంది. ఈ నిబంధన 1, జూన్ 2021 నుంచి అమల్లోకి వస్తుంది. అంతేకాకుండా
కనీసం రెండేళ్లకు పైగా యాక్టివ్ లో లేని అకౌంట్ల నుంచి డేటాను తొలగించేలా సవరణలు
చేపట్టింది.
అయితే జూన్ 1, 2021 నాటికి అప్లోడ్ చేసిన ఫొటోలు, డాక్యుమెంట్లు ఈ 15 జీబీ పరిధిలోకి రావని గూగుల్ స్పష్టం చేసింది. వినియోగదారులకు ఇతరుల కంటే
ఎక్కువ మొత్తంలో ఉచిత స్టోరేజీని అందిస్తున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. యూజర్లు
15 జీబీ డేటాకు చేరువవుతున్న కొద్దీ అలెర్ట్ మెజేన్లు
వస్తాయి. అంతేకాకుండా అవసరం లేని, డూప్లికేట్, బ్లర్ ఫోటోలను గుర్తించేందుకు వీలుగా కొన్ని మేనేజ్ మెంట్ టూల్స్ ను గూగుల్
అభివృద్ధి చేసింది. వీటిని ఉపయోగించి ఫోటోలను డిలీట్ చేసుకునే అవకాశముంది.
గూగుల్ ఫొటోలో డేటా రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 4 ట్రిలియన్లకు పైగా ఫొటోలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. అంతేకాకుండా ప్రతివారమూ 28 బిలియన్ల ఫోటోలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ఉచిత సేవలు కావడంతో చాలా మంది యూజర్లు ఎక్కువ మొత్తంలో డేటాను అందులో స్టోర్ చేసేస్తున్నారు. దీంతో సర్వర్లపై భారం ఎక్కువవుతోంది. దీనిని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఛార్జీలు వర్తింప చేయాలని గూగుల్ నిరయించినటు తెలుసోంది. ఛారీలు 1.99 అమెరికన్ డాలర నుంచి ప్రారంభమవుతాయి. 100 జీబీ వరకు నెలకు 1.99 డాలర్లు వసూలు చేస్తారు. 100 నుంచి 200 జీబీ వరకు నెలకు 2.99 డాలర్లు, 2 టీబీ వరకు 9.99 డాలర్లు, అది దాటిన తర్వాత 30 టీబీ వరకు 149.99 డాలర్లు వసూలు చేయనున్నారు. అయితే నెలకు 5.99 డాలర్ల చొప్పున ఏడాది ప్లాన్ ఒకేసారి తీసుకుంటే అన్లిమిటెడ్ స్టోరేజీ పొందే అవకాశం గూగుల్ కల్పించింది.
0 Komentar