Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Govt eases guidelines to make 'work from home' permanent

 


Govt eases guidelines to make 'work from home' permanent

గుడ్ న్యూస్: శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్ హోమ్.. కీలక నిబంధనలు తొలగించిన కేంద్రం

కరోనా వైరస్ సమయంలో ఇంటి నుంచి పనిచేసే విధానానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, బీపీఓ పరిశ్రమలకు ఊరట కలిగించే కేంద్రం ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. 

ఐటీ, బీపీఓ కంపెనీలు కార్యాలయ సముదాయాల్లోనే కాకుండా ఇంటి నుంచి పనిని నిర్వహించడానికి వీలు కల్పించేలా కీలక నిబంధనలను కేంద్రం గురువారం తొలగించింది. తాజా నిర్ణయంతో ఐటీ సంస్థల్లోని ఉద్యోగులు ఏ ప్రదేశం నుంచైనా శాశ్వతంగా పనిచేయడానికి వీలు కలుగుతుంది. కరోనా వైరస్ కట్టిడికి విధించిన లాక్‌డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెద్ద సంఖ్యలో ప్రారంభించిన తరువాత ఐటీ, టెక్ కంపెనీలు సడలింపు కోరడంతో టెలికాం విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇతర సర్వీస్ ప్రొవైడర్‌ల కోసం టెలికాం విభాగం అతి పెద్ద సంస్కరణ చేపట్టి నిబంధనలు సరళీకృతం చేసింది. ఇది దేశంలో ఎక్కడ నుంచి అయిన శాశ్వతంగా పనిచేసే విధానాన్ని ప్రోత్సహిస్తుంది.. ఐటీ, టెక్, బీపీఓ పరిశ్రమకు గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది’ అని టెలికం శాఖ పేర్కొంది. ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించారు. 

‘‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ను మరింతగా పెంచడానికి, భారతదేశాన్ని టెక్ హబ్‌గా మార్చడానికి కట్టుబడి ఉన్నాం.. టెలికాం విభాగం ఓఎస్పీ మార్గదర్శకాలను ప్రభుత్వం గణనీయంగా సరళీకృతం చేసింది. ఈ కారణంగా బీపీఓ పరిశ్రమకు భారం తగ్గుతుంది.. ఐటీ పరిశ్రమకు కూడా ప్రయోజనాలు చేకూరుతాయి’అని ట్వీట్ చేశారు. 

భారత ఐటీ రంగం మాకెంతో గర్వకారణం. ఈ రంగం శక్తి సామర్ధ్యాలను ప్రపంచం మొత్తం గుర్తించింది.. దేశంలో వృద్ధి, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి సాధ్యమైన ప్రతి అంశాన్ని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాము. నేటి నిర్ణయాలు ముఖ్యంగా ఈ రంగంలోని యువ ప్రతిభను ప్రోత్సహిస్తాయి!’ అని అన్నారు. 

టెలికమ్ విభాగం మార్గదర్శకాల ప్రకారం.. ‘ఓఎస్పీలకు రిజిస్ట్రేషన్ అవసరం పూర్తిగా తొలగించాం. డేటా సంబంధిత పనిలో నిమగ్నమైన బీపీఓ పరిశ్రమను నిబంధనల పరిధి నుంచి తొలగించాం.. ఐపీ అడ్రస్‌ల కోసం చెల్లించే బ్యాంక్ గ్యారెంటీ, తరుచూ నివేదికలు, నెట్‌వర్క్ విధానం మొదలైన నిబంధనలను ఎత్తివేశాం... అదేవిధంగా, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’ విధానాలను అవలంబించకుండా నిరోధించే అనేక ఇతర నిబంధనలను కూడా రద్దుచేసినట్టు టెలికాం, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 

కేంద్రం నిర్ణయానని ఐటీ పరిశ్రమ స్వాగతించింది. ‘ఇది నిజంగా దీర్ఘకాలిక, ప్రగతిశీల ఆలోచన, మన పరిశ్రమను మరింత పోటీలో నిలుపుతుంది.. ఎక్కడి నుంచైనా పనిచేయడం కొత్త రియాలిటీగా మారింది.. దీనిని అమలు చేసినందుకు ధన్యవాదాలు’ అని విప్రో ఛైర్మన్ రషీద్ ప్రేమ్ జీ అన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags