Here the Last Lunar Eclipse In 2020 And the
Details
కార్తీక పౌర్ణమి రోజు
చంద్రగ్రహణం.. ఈ ఏడాదికి చివరి గ్రహణం
ఈ ఏడాది కార్తీక పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. అదే రోజు ఈ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఫలితంగా కార్తీక పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా చూడవచ్చు. ఇక్కడ ఉపఛాయ గ్రహణం ఏర్పడనుంది. తద్వారా సూతకాన్ని పరిగణించరు.
హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక పౌర్ణమి చాలా ముఖ్యమైనది. ఈ ఏడాది నవంబరు 30న రానుంది. ఆ రోజు ఏవైనా దానాలు, పుణ్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినట్లయితే మనుషుల జన్మజన్మలకు ఆ ఫలితం ఉంటుంది. ఈ ఏడాది కార్తీక పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. అదే రోజు ఈ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఫలితంగా కార్తీక పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా చూడవచ్చు. ఇక్కడ ఉపఛాయ గ్రహణం ఏర్పడనుంది. తద్వారా సూతకాన్ని పరిగణించరు. ఈ సమయంలో అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయవచ్చు. అయితే గ్రహణం యోగంలో చేసే పుణ్యాలు, దానాలు వల్ల సాధారణ రోజుల కంటే ఎక్కువ ఫలవంతంగా ఉంటాయి.
గ్రహణం ఈ విధంగా ఉంటుంది..
కార్తీక పౌర్ణమి రోజున ఈ ఏడాదికి చివరిదే కాకుండా ఉపఛాయ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడి చిత్రం ఎక్కడా నల్లగా ఉండదు. అయితే కాంతిలో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. చంద్రుడి ప్రకాశం కొంత మసకబారుతుంది. ఎప్పుడు గ్రహణం సంభవించినా తొలిసారి చంద్రగ్రహణం ఏర్పడితే ఈ స్థానం గుండా వెళ్తారు. ఆపై చంద్రుడి చిత్రం నల్లగా కనిపించడం ప్రారంభమవుతుంది. కానీ ఈ గ్రహణంలోచంద్రుడు నల్లబడటానికి ముందే గ్రహణం ముగుస్తుంది. కాబట్టి దీన్ని సంపూర్ణ గ్రహణమని కాకుండా ఉపఛాయ గ్రహణమని పిలుస్తారు.
శాస్త్రాల్లో దీని ప్రాముఖ్యత..
శాస్త్రాల ప్రకారం ఉపఛాయ చంద్రగ్రహణాన్ని గ్రహణంగా పరిగణించబడరు. కాబట్టి సుతక కాలాన్ని పరిగణించరు. అందువల్ల గ్రహణం సమయంలో దేవాలయల తలుపులు మూసివేయరు. ఆధ్యాత్మిక పనులు, ఆరాధనలు జరుగుతాయి. చంద్రగ్రహణం ప్రభావాలు కూడా పెద్దగా చూపవు.
కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణం సమయం..
కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం మధ్యాహ్నం 01.20 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 03.13 గంటలప్పుడు మధ్యస్తంగా ఉంటుంది. సాయంత్రం 05.23 గంటలకు గ్రహణం వీడుతుంది. ఈ చంద్రగ్రహణం దేశంలోని అనేక ప్రాంతాల్లో చంద్రోదయం ముందు ముగుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 05.23 గంటలకు చంద్రోయం ఉంటుంది. చంద్రకాంతి పడే ప్రదేశాల్లో పాక్షికంగా వీక్షించవచ్చు. ఇతర ప్రదేశాల్లోని ప్రజలు ఈ గ్రహణాన్ని చూడలేరు.
చంద్రగ్రహణాన్ని దేశంలో ఏయే ప్రాంతాల్లో వీక్షించవచ్చు..
కార్తీక పౌర్ణమి రోజు సంభవించే చంద్రగ్రహణాన్ని భారత్ లో కోల్ కతా, అసోం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, బీహార్, జార్ఘండ్, ఇతర ఈశాన్య, తూర్పు మధ్య ప్రాంతాల్లో ప్రజలు వీక్షించవచ్చు. భారత్ తో పాటు పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, ఆఫ్గనిస్థాన్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, నార్వే, యూఎస్ఏ, స్వీడన్, ఫిన్లాండ్ సహా ఇతర పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది.
0 Komentar