Hot Water Bathing Protects
Cardiovascular Function in Middle-Aged to Elderly
వేడి నీటి స్నానంతో ఇన్ని
ప్రయోజనాలా?
వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదా.. కాదా అని ఆలోచిస్తున్నారా? స్టడీలో తేలిన ఈ విషయాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.
చాలామందిలో ఓ గందరగోళం ఉంటుంది.
వేడి నీళ్ల స్నానం మంచిదా? చన్నీళ్ల? అనే సందేహం
ఉంది. అయిదే, దీనిపై పరిశోధకులు కొన్ని ఆసక్తికర విషయాలు
తెలిపారు. వేడినీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి కొంతమేర వ్యాయామం చేసిన ఫలితం
కలుగుతుందని పేర్కొన్నారు. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. వేడినీటి
స్నానం చేయడం వల్ల కూడా శరీరంలో అలాంటి ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు.
అధ్యయంలో భాగంగా పరిశోధకులు 2,300 మంది మధ్య వయసు వ్యక్తులను 20 ఏళ్లు గమనించారు. వారిలో వారానికి ఒకసారి ఆవిరి లేదా వేడి స్నానం చేసినవారిలో 20 ఏళ్ల కాలంలో సగం మంది మృతి చెందినట్లు తెలుసుకున్నారు. వారంలో రెండు నుంచి మూడుసార్లు ఆవిరి స్నానం చేసినవారిలో 38 శాతం మంది చనిపోయారు. నిత్యం వేడి స్నానం చేసే వారిలో గుండెపోటు, ఇతరాత్ర గుండె సమస్యల ముప్పు తగ్గుతున్నట్లు తెలుసుకున్నారు.
వేడి నీటి స్నానం వల్ల రక్త సరఫరా పెరగడం, రక్తపోటు తగ్గడం వంటివి జరుగుతున్నాయని, అందువల్లే గుండె సమస్యలు తగ్గాయని తెలిపారు. వేడి నీటి స్నానం గురించి ఫాల్కనర్ మరో పరిశోధన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అభ్యర్థుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు, శరీరంలోని అంతర్భాగాల్లో ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ఏర్పాట్లు చేశారు.
అధ్యయనం మొదటి దశలో అభ్యర్థులు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న వేడి నీటిలో కొలనులో గంట సేపు స్నానం చేశారు. రెండో దశలో వీరందరితో గంటపాటు సైకిల్ తొక్కించారు. ఈ రెండు దశల్లో వారి శరీరాల్లో కలిగిన మార్పులను గమనించారు. వేడినీటి స్నానం చేసినవారిలో 140 క్యాలరీలు కరిగినట్లు గుర్తించారు. గంట సేపు సైకిల్ తొక్కినవారిలో సుమారు 630 క్యాలరీలు కరిగినట్లు తెలుసుకున్నారు. సైకిలింగ్‌తో పోల్చితే వేడి నీటి స్నానం వల్ల కరిగిన క్యాలరీలు తక్కువే కావచ్చు. కానీ, కేవలం స్నానంతోనే 100 పైగా క్యాలరీ తగ్గడం నిజంగా ఆశ్చర్యకరమే కదూ.
గమనిక: అధ్యయనంలో పేర్కొన్న అంశాలనే ఈ కథనంలో వివరించామని గమనించగలరు. వేడి నీటి స్నానం వల్ల మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలని మనవి. ఈ కథనం వైద్యానికి ప్రత్యామ్నయం కాదు.
0 Komentar