IAF AFCAT 2021 Notification Released: Register and Apply Now
ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్‌లైన్
టెస్ట్ - ఏఎఫ్‌క్యాట్ -2021
భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్
సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్
అడ్మిషన్ ఆన్‌లైన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్) ప్రకటన విడుదలైంది. ఏటా మే/ జూన్,
డిసెంబరు నెలల్లో ఈ ప్రకటన వెలువడుతుంది.
వివరాలు..
ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ/ ఎన్‌సీసీ
స్పెషల్ ఎంట్రీ
మొత్తం ఖాళీలు: 235
ఖాళీలున్న విభాగాలు: ఫ్లైయింగ్, గ్రౌండ్
డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్సీసీ
స్పెషల్ ఎంట్రీ (ఫ్లైయింగ్).
అర్హత: సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్
డిగ్రీ, బీకాం, డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, ఎన్‌సీసీ
సర్టిఫికెట్, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: ఫ్లైయింగ్ బ్రాంచు పోస్టులకు
జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. మిగిలినవాటికి
20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజినీరింగ్
నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్
(పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు ఫీజు: ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ
పోస్టులకు రూ.250. మిగిలిన విభాగాలకు ఫీజు చెల్లించనవసరం లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం:
01.12.2020.
దరఖాస్తుకు చివరి తేది:
30.12.2020.
0 Komentar