IIIT Admission Entrance Test (RGUKT)
-2020
ఆర్జీయూకేటీ ప్రవేశ పరీక్షకు 650 కేంద్రాలు
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక
విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)తో పాటు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ, శ్రీవెంకటేశ్వర
వెటర్నరీ, డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టీకల్చర్
విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 650 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కులపతి ఆచార్య కె.సి.రెడ్డి తెలిపారు.
శనివారం నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఆయన మాట్లాడారు. అవసరమైతే కేంద్రాలను 700 వరకు పెంచుతామన్నారు. దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈ నెల 10 నుంచి 13 వరకు, ఆలస్య రుసుంతో
ఈ నెల 15 నుంచి 16 వరకు పొడిగించినట్లు
తెలిపారు. ఈ విద్యా సంవత్సర మొదటి సెమిస్టర్ 2021 మార్చికి,
రెండో సెమిస్టర్ ఆగస్టు నాటికి ముగుస్తుందని వెల్లడించారు.
విద్యార్థుల పరిశోధనలకు సంబంధించి తిరుపతి ఐఐటీతో ఎంఓయూ కుదుర్చుకోనున్నట్లు
పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలకు శాశ్వత డైరెక్టర్‌ల నియామకం ఈ నెలాఖరుకు పూర్తయ్యే
అవకాశం ఉందన్నారు.
0 Komentar