Income Tax Refunds Worth Rs 1.36 Lakh
Crore Issued To 40.19 Lakh Taxpayers Till Nov 17,
పన్ను చెల్లింపుదారులకు రూ.లక్ష
కోట్లకు పైనే రిఫండ్స్‌ను జారీ
కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు రూ.లక్ష కోట్లకు పైనే రిఫండ్స్‌ను జారీ చేసింది.
నవంబర్ 17 నాటికి 40 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు ఈ రిఫండ్స్ అందించినట్లు తెలిపింది.
ఆదాయపు పన్ను శాఖ రిఫండ్స్
లక్షల మందికి రిఫండ్స్ జారీ
వీటి విలువ రూ.1.3 లక్షల కోట్లు
మోదీ సర్కార్ పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ట్యాక్స్ పేయర్స్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి దాకా ఏకంగా రూ.1.36 లక్షల కోట్ల రిఫండ్స్‌ను జారీ చేసింది. 40 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు ఈ రిఫండ్ అందించింది. అంటే వీరి అకౌంట్లలోకి ట్యాక్స్ రిఫండ్ డబ్బులు వచ్చి చేరాయి.
ట్యాక్స్ రిఫండ్స్‌లో పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్స్ విలువ రూ.35,750 కోట్లుగా ఉందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇక కార్పొరేట్ ట్యాక్స్ రిఫండ్స్ విలువ ఏకంగా రూ.లక్ష కోట్లకు పైమాటే అని చెప్పుకోవాలి. ఇప్పటి దాకా ఈ రిఫండ్ లెక్కలు వర్తిస్తాయి.
రూ.1,36,066 కోట్లకు పైగా విలువైన రిఫండ్స్‌ను సీబీడీటీ జారీ చేసింది. 40.19 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఈ రిఫండ్స్ చేరాయి. 2020 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 17 వరకు జారీ అయిన రిఫండ్స్ లెక్కలు ఇవి’ అన ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది.
ఇకపోతే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ
అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ PFRDA చైర్మన్ సుప్రతిం బంద్యోపాద్యాయ్
మాట్లాడుతూ.. పీఎఫ్‌ఆర్‌డీఏ ఎన్‌పీఎస్‌కు సంబంధించి అందరికీ పన్ను మినహాయింపు
కల్పించాలనే ప్రతిపాదన చేస్తుందని తెలిపారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS స్కీమ్‌కు సంబంధించి కంపెనీ కంట్రిబ్యూషన్‌కు ఇది వర్తిస్తుంది.
0 Komentar