Indian Army to hold recruitment rally in
Secunderabad in January. Check details
సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్
ర్యాలీ.. వివరాలివే..!
తెలంగాణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. 2021 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 28 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఏఓసీ సెంటర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ, పౌర సంబంధాల శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే 2021 జనవరిలో కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులు అనుకూలంగా ఉంటే రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్, ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్స్‌మెన్(ఓపెన్ కేటగిరీ) పోస్టుల భర్తీకి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ లాంటి క్రీడల్లో నైపుణ్యం ఉన్న వారికి 2021 జనవరి 15న స్పోర్ట్స్ ట్రయల్ ఉంటుంది. అభ్యర్థులు అదే రోజున సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌లో ఉన్న థపర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్‌లో సీనియర్ లేదా జూనియర్ లెవెల్‌లో సర్టిఫికెట్లు పొంది ఉండాలి.
స్క్రీనింగ్ తేదీ నుంచి రెండేళ్లలోపు తీసుకున్న సర్టిఫికెట్లు మాత్రమే ఉండాలి. అంతకన్నా పాత సర్టిఫికెట్లు ఉంటే పరిగణలోకి తీసుకోరు. పూర్తి వివరాలను http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అలాగే airawat0804@nic.in మెయిల్ ఐడీకి మీ సందేహాలను పంపి సమాధానాలు తెలుసుకోవచ్చు.
ముఖ్య సమాచారం:
భర్తీ చేసే పోస్టులు: సోల్జర్ టెక్
(AE),
సోల్జర్ జనరల్ డ్యూటీ (GD), సోల్జర్ ట్రేడ్‌మెన్,
ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్ మెన్ (ఓపెన్ కేటగిరీ) పోస్టులు
భర్తీచేస్తారు.
విద్యార్హతలు:
సోల్జర్ జనరల్ డ్యూటీ (GD) పోస్టుకు మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్‌సీ 45 శాతం
మార్కులతో పాస్ కావాలి. ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 33 శాతం
మార్కులు ఉండాలి.
సోల్జర్ ట్రేడ్‌మెన్ పోస్టుకు 10వ
తరగతి ఉత్తీర్ణత కావాలి.
సోల్జర్ టెక్ (AE) పోస్టుకు సైన్స్ సబ్జెక్ట్‌తో 10+2 పాస్ కావాలి.
సోల్జర్ Clk/SKT పోస్టుకు 10+2 లేదా ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కావాలి.
ర్యాలీ జరిగే తేదీ: 2021 జనవరి 18 నుంచి 2021 ఫిబ్రవరి
28 వరకు
స్పోర్ట్స్ ట్రయల్ నిర్వహించే
తేదీ: 2021 జనవరి 15
వయస్సు: సోల్జర్ జనరల్ డ్యూటీ (GD) కేటగిరీకి 17.5 నుంచి 21 ఏళ్లు,
ఇతర కేటగిరీలకు 17.5 నుంచి 23 ఏళ్లు.
వెబ్‌సైట్: http://www.joinindianarmy.nic.in/
0 Komentar